త‌ర్వాత టార్గెట్ హారీష్‌రావేనా ?

తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన త‌ర్వాత అస‌లు రాజ‌కీయాలు ఇప్పుడు మొద‌లైనాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క తెరాస‌నే రాష్ట్రం ఏలే పార్టీ అనుకున్నారు. కానీ గ‌త కొన్ని రోజులుగా మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు మంత్రుల‌కు ఉద్వాస‌న ప‌లికేలా ఉన్నాయి. ఓవైపు రాష్ట్ర రాజ‌కీయాల్లోకి సీఎం కేసీఆర్ కుమార్తే రావ‌డం. అంత‌లోనే కరీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి రాస‌లీల‌లు బ‌య‌ట‌ప‌డ‌డం. ఇలా శ‌ర‌వేగంగా రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక త‌ర్వాతో టార్గెట్ ఎవ‌రూ అనేది ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో న‌డుస్తున్న చ‌ర్చ‌.
రాజకీయ వ‌ర్గాల‌లో దుబ్బాక ఎన్నిక‌ల్లో తెరాస పార్టీ ఇప్పుడు గెలుస్తుందా అనే అనుమానం దాక వ‌చ్చింది అంటే పార్టీ ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు. కానీ ఉప ఎన్నిక‌ల కింగ్ అని పిల‌వ‌బుడుతున్న హారీష్‌రావు త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తార‌ని ఆయ‌న ఖాతాలో మ‌రో ఉప ఎన్నిక విజ‌యం ప‌డుతుంద‌ని ఆ పార్టీ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కానీ అంచానాలు త‌కిందులైతే హారీష్ రావు మంత్రి ప‌ద‌విపై బారం ప‌డే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎన్న‌డూ లేనంత క‌ష్టం ఇప్పుడు హారీష్‌రావు ప‌డుతున్నార‌ని అంటున్నారు.
ప్ర‌చారంలో అక్క‌డ‌క్క‌డ ఎదురుదెబ్బులు త‌గిలిన హారీష్‌రావు ఇప్పుడు, మీడియా, సోష‌ల్ మీడియా మీద దృష్టి సారించార‌ని స‌మాచారం.
కమలనాథుల ప్లానింగ్‌ను అర్థం చేసుకోవటానికి కాస్త టైం తీసుకున్న హరీశ్ రావు.. మ‌రో ప్లాన్ లోకి వెళ్లినట్లు చెబుతారు. సహజంగా ఉండే దూకుడుకు.. అధికారాన్ని చేర్చటంతో పాటు.. ప్రత్యర్థుల్ని ఉతికి ఆరేసే రీతిలో నోటికి పని చెప్పటం షురూ చేశారు. అయినప్పటికీ కమలనాథుల నుంచి వస్తున్న ప్రతిస్పందనకు ధీటుగా సమాధానం చెప్పాల్సిన విషయాన్ని గుర్తించిన హరీశ్, తన ప్లానింగ్‌లో కొత్త మార్పులు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఆయన, గతానికి భిన్నంగా కాస్త ప్రయారిటీ ఇవ్వాలని ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులకు చెప్పటం కనిపించింది. అనంతరం మీడియా సంస్థలకు చెందిన ముఖ్యులకు ఫోన్లు చేసి, ప్రెస్ మీట్‌కు ప్రయారిటీ ఇవ్వాలని కోరటం గమనార్హం.
అయితే ఈ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే మ‌రి.