ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత

డెక్క‌న్ న్యూస్ఆ, దిలాబాద్ జిల్లా ప్ర‌తినిధి, సయ్యద్ ఖమర్ :
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో శనివారం రోజు రోడ్డు ఇరువైపుల మరియు ఆర్ అండ్ బి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి వెలిసిన దుకాణాలను గ్రామపంచాయతీ , రెవెన్యూశాఖ అధికారులు పోలీసు బందోబస్తును మధ్య తొలగించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ అధికారి సూర్యప్రకాష్ మాట్లాడుతూ రోడ్డు కు అనుకుని అక్రమంగా టెలాలు షాపులు వేసుకోవడంతో తీవ్రంగా ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని పిర్యాదు లు రావడంతో చర్యలు తీసుకున్నామని అన్నారు. ఆక్రమించి వ్యాపారాలను నిర్వహించడం వల్ల ప్రయాణికులు వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు .
కాగా అక్రమ దుకాణాల తొలగింపుతో మా కుటుంబాలు రోడ్డున పడ్డాయని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు పై ధర్నా చేశారు. సుమారు గంట పాటు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఆకాష్ యాదవ్ వారిని సముదాయించిన వినలేదు. ఆక్రమణలు కేవలం పేదవారి వి మాత్రమే కాదని , బడా వ్యాపారులు రోడ్డు పై షెట్టర్ లు వేసి ట్రాఫిక్ కు నిబంధనలు ఉల్లంఘించి న వారి పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన కారులు అధికారులను ప్రశ్నించారు . కొంతసేపటికి తహశీల్దార్ అతికొద్దీన్ చేరుకొని ఆందోళన కారులతో మాట్లాడి వారికి వ్యాపారానికి అదే ప్రదేశంలో ఏర్పాటు చేసేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన కారులు శాంతించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ జాదవ్ రామారావు సి ఐ రవీందర్ , ఆర్ ఐ అరుణ్ , గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.