ముక్కు నుండి రక్తం వస్తుందా ?
జీవితాలని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి వలన మనకి ఆరోగ్యం గురించి ఎన్నో విషయాలు తెలిశాయి. విటమిన్స్, మినరల్స్ మన శరీరానికి ఎంత అవసరమో అర్ధమైంది. విటమిన్ సీ ఇమ్యూనిటీకీ, విటమిన్ డీ ఎముకలు బలం గా ఉండడానికీ, విటమిన్ ఏ కంటి చూపుకీ, బీ విటమిన్స్ ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో తెలుసుకుంటున్నాం. అలాగే, ఇప్పుడు విటమిన్ కే గురించి కూడా తెలుసుకుందాం. డాక్టర్ స్రవంతి విటమిన్ ఏ లాగానే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. విటమిన్ కే మనకి చేసే మేలు గురించి తెలిపారు అవి ఏంటో ఏమిటో చూద్దాం.
విటమిన్ కే డెఫిషియెన్సీ ఉంటే ఈ క్రింది లక్షణాలు కనపడతాయి. కానీ, ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన విటమిన్ కే డెఫిషియెన్సీ వల్లనే అన్న నిర్ధారణకి రాలేము, ఎందుకంటే ఈ సింప్టంస్ చాలా కామన్ గా ఉంటాయి, కనుక్కోవడం కొద్దిగా కష్టం.
- ఏదైనా గాయమైనప్పుడు రక్తస్రావం తొందరగా ఆగదు. చిన్న దెబ్బలకి కూడా ఎక్కువ రక్తం పోతుంది.
- విటమిన్ కే చాలినంత లేకపోతే రక్తహీనత లేదా అనీమియా ఏర్పడవచ్చు. అనీమియా వల్ల నీరసం గా, ఓపిక లేకుండా ఉంటారు.
- కడుపు నొప్పి కి కూడా విటమిన్ కే డెఫిషియెన్సీ కారణం కావచ్చు.
- ముక్కులో నుండి రక్తం కారడం కూడా విటమిన్ కే సరిపోయినంత లేదనడానికి సూచనగా భావించవచ్చు.
విటమిన్ కే ఫుడ్స్…
ఇక్కడ విటమిన్ కే సమృద్ధిగా లభించే ఆహార పదార్ధాలు ఉన్నాయి. వాటిని మీ డైట్ లో భాగం చేసుకోండి. - పాల కూర
పాల కూర లో కొలెస్ట్రాల్ తక్కువ, డైటరీ ఫైబర్ ఎక్కువ, విటమిన్ కే తో పాటూ ఏ, సీ విటమిన్స్ కూడా ఉంటాయి. ఐరన్ కూడా పాల కూర ద్వారా లభిస్తుంది. పాల కూర బోన్ హెల్త్ కే కాక రెడ్ బ్లడ్ సెల్స్ సరిగ్గా ఫంక్షన్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. పాల కూర తో పప్పు, స్మూతీ, స్పినాచ్ పాన్ కేక్, సూప్స్, సలాడ్స్, సాగ్ పనీర్ వంటివి తయారు చేయవచ్చు. - కాలే
విటమిన్ కే కొరకు తీసుకోవాల్సిన ఫుడ్స్ యొక్క లిస్ట్ లో తప్పని సరిగా ఉండే ఐటెమ్ ఇది. ఇందులో ఇంకా ఫైబర్, ప్రొటీన్, ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉన్నాయి. చిక్పీ కాలే సూప్, బీట్రూట్ కాలే స్మూతీ, క్రిస్పీ కాలే, కాలే బీన్ సలాడ్, కాలే రోస్టెడ్ కాలీఫ్లవర్ సలాడ్ వంటివి తయారు చేయవచ్చు. - బ్రకోలీ
ఎక్కువ న్యూట్రియెంట్స్ ని అందించే వెజిటబుల్స్ లో బ్రకోలీ కూడా ఒకటి. ఇది జ్యూసీగా, ఫ్రెష్ గా, ఫర్మ్ గా ఉండాలి. సరిగ్గా వండితేనే దీనిలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ అందుకోగలుగుతాం. అప్పుడే రుచి కూడా బావుంటుంది. బ్రకోలీ ఆల్మండ్ సూప్, బేక్డ్ బ్రకోలీ, బ్రకోలీ సలాడ్, చార్ గ్రిల్డ్ బ్రకోలీ, బ్రకోలీ పాస్తా, బ్రకోలీ స్టర్ ఫ్రై వంటివి తయారు చేయవచ్చు. - లెట్యూస్
లెట్యూస్‌లో విటమిన్ కే తో పాటూ ప్రొటీన్, విటమిన్ ఏ, పొటాషియం ఉన్నాయి. లెట్టూస్ తో సహజం గా సలాడ్ గానీ శాండ్విచ్ కానీ చేస్తారు. కానీ, మిలమిలా మెరిసే ఈ ఆకు కూరని చాలా రకాలుగా వండచ్చు. లెట్టూస్ రాప్డ్ కాటేజ్ చీజ్ రోల్స్, లెట్టూస్ సూప్, లెట్టూస్ స్టర్ ఫ్రై వంటివి కూడా చేయవచ్చు. - ఫిష్
ఫిష్ ఎంత మంచిదో మనందరికీ తెలిసిన విషయమే. అయితే, మనలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఫిష్ లో విటమిన్ కే కూడా ఎక్కువగానే ఉంటుందని. ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, ఫిష్ టిక్కా, ఫిష్ బిర్యానీ, ఫిష్ మంచూరియన్, బేక్డ్ ఫిష్ తో పాటూ చేపల పులుసు కి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. - కాలీఫ్లవర్
కాలీఫ్లవర్ ఇండియా లో చాలా పాప్యులర్ వెజిటబుల్. కాలీఫ్లవర్ డైజెస్టివ్ సిస్టమ్ నె హెల్దీగా ఉంచుతుంది, ఆర్థ్రైటిస్ ని ప్రివెంట్ చేస్తుంది, ఒబేసిటీ ని తగ్గిస్తుంది. కాలీఫ్లవర్ కర్రీ, కాలీఫ్లవర్ సలాడ్, అలూ గోబీ, గోబీ పరాథా, గోబీ పకోడా తో పాటూ గోబీ మంచూరియా తయారు చేయవచ్చు. బెస్ట్ పార్ట్ ఏమిటంటే కాలీఫ్లవర్ తో ఏది చేసినా రుచిగానే ఉంటుంది. - ఎగ్స్
త్వరగా అయిపోయే వంటకాలేమిటంటే ముందుగా చెప్పేది ఎగ్స్ తో చేసేవే. తక్కువ టైమ్ లో కూడా నోరూరించే డిషెస్ ఎగ్స్ తోనే చేయగలం. ఎగ్స్ లో ఇంకా హై-క్వాలిటీ ప్రొటీన్ కూడా ఉంటుంది. ఆమ్లెట్, స్క్రాంబుల్డ్ ఎగ్స్, పోచ్డ్ ఎగ్స్, ఎగ్ కర్రీ, ఎగ్ స్టర్ ఫ్రై, ఎగ్ బిర్యానీ, ఎగ్ ఫ్రైడ్ రైస్.. ఇలా ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు. సింపుల్ గా హార్డ్ బాయిల్డ్ ఎగ్ కూడా సాల్ట్ పెప్పర్ తో ఎంజాయ్ చేస్తాం కదా. - బ్రస్సెల్ స్ప్రౌట్స్
క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రకోలీ, బ్రస్సెల్ స్ప్రౌట్స్ అన్నీ ఒకే ఫ్యామిలీకి చెందినవి. ఇందులో ప్రొటీన్స్, ఫైబర్, విటమిన్స్ సీ, కే ఉంటాయి. కార్బ్స్ తక్కువ. బ్రస్సెల్ స్ప్రౌట్స్ ని క్యారెట్, బ్రకోలీ వంటి వాటి తో కలిపి సాటీ చేసి కొద్దిగా ఉప్పు చల్లి హ్యాపీగా తినేయవచ్చు. బ్రస్సెల్ స్ప్రౌట్స్ సలాడ్, రోస్టెడ్ బ్రస్సెల్ స్ప్రౌట్స్ కూడా ఎంజాయ్ చేయవచ్చు. - కివీ
కివీని పోషకాల గని గా చెప్పుకోవచ్చు. విటమిన్ కే తో పాటూ, విటమిన్స్ ఏ, బీ12, బీ6, ఈ, ఐరన్, కాల్షియం, పొటాషియం కివీలో ఉంటాయి. కివీ కుకంబర్ జ్యూస్, కివీ స్మూతీ, కివీ అప్ సైడ్ డౌన్ కేక్, కివీ పావ్లోవా, కివీ సలాడ్, కివీ బ్రెడ్ హల్వా వంటివి కివీ తో తయారు చేయవచ్చు. అలాగే తినేసినా కూడా కివీ ఎంతో రుచిగా ఉంటుంది.
ఇవి తినే ముందు డాక్టర్‌ని అడగండి.