మంత్రి హరీష్ రావుపై తిరగబడిన ప్రజలు

దుబ్బాక మండలం అప్పన్ పల్లి గ్రామంలో మంత్రి హరీష్ రావుకి చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామానికి ఎందుకు వచ్చావు అని ప్రజలు తిరగబడ్డారు. ఆరేళ్లుగా మా గ్రామాన్ని పట్టించుకోలేదని, మా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఈరోజు గ్రామానికి వచ్చి డబ్బులు వెదజల్లి ఓట్లు దండుకోవడానికి హరీష్ రావు వచ్చాడని స్థానిక ప్రజలు ఆరోపించారు. అప్పన్ పల్లి ఓటు అడగవద్దు అని అన్నారు. మంత్రి అని చూడకుండా ప్రజలు ఇక్కడ రాయలేని భూతులతో దూషించారు.