వరంగల్ హత్యకేసులో నిందితుడికి ఉరిశిక్ష

తెలంగాణలో సంచలనం వరంగల్ బావిలో తొమ్మిది మంది హత్య కేసులో నిందితుడికి కోర్టు శిక్ష ఖరారు చేసింది. సంచలనం సృష్టించిన గొర్రెకుంట తొమ్మిది మంది హత్య కేసులో నిందుతుడు సంజయ్ కుమార్ యాదవ్ కు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది ఈ ఏడాది మే 20న వరంగల్‌ నగర శివారులోని గొర్రెకుంట బావిలో 9మందిని హత్య చేసిన కేసులో విచారణ పూర్తయింది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నిందితుడిపై అభియోగాలను నిరూపించారు. సంజయ్ కుమార్ కి ఉరి శిక్ష పడాలనీ అదే సరైన శిక్ష అంటూ న్యాయమూర్తి ముందు బలంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యనారాయణ తన వాదనలు బలంగా వినిపించారు. న్యాయమూర్తి ముందు హత్యలు చేసినట్టు నిందితుడు సంజయ్ కుమార్ నేరం అంగీకరించాడు. దీంతో నేరం రుజువైనట్లు వరంగల్‌ మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు. నిందితుడిపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటన జరిగిన నెల రోజుల్లోనే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయడం గమనార్హం. 25 రోజుల్లోనే చార్జీషీట్ దాఖలు చేశారు పోలీసులు. ఈ కేసులో దాదాపు 98 మందిని న్యాయమూర్తి విచారించారు. వారిలో 68 మందిని సాక్షులుగా పరిగణలోకి న్యాయమూర్తి జయకుమార్ తీసుకున్నారు.