ఏపీ ప్ర‌జ‌ల‌కు వైఎస్సార్ బీమా పథకం

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ బీమా పథకం ప్రారంభమైంది. సీఎం వైఎస్ జగన్ తన క్యాంప్ కార్యాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. 18-50 ఏళ్ల మధ్య వారు మరణిస్తే నామినీకి రూ.5 లక్షల బీమా వర్తిస్తుంది. 51-70 ఏళ్ల మధ్య లబ్ధిదారుడు మరణిస్తే రూ.3 లక్షల పరిహారం లభించనుంది. లబ్ధిదారుడు సహజ మరణం పొందితే రూ.2 లక్షల పరిహారం అందనుంది. ప్రమాదంలో చనిపోతే రూ.5 లక్షల బీమా వర్తించనుంది. శాశ్వత అంగవైకల్యానికి రూ.5లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.1.50 లక్షల బీమా వర్తించనుంది. లబ్ధిదారుల తనఫున పూర్తి ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించనుంది. ఈ పథకానికి ప్రభుత్వం రూ.510 కోట్లకు పైగా నిధులను కేటాయించింది. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పథకం ద్వారా లబ్ది.. బీమా రక్షణ ఏర్పడుతుంది.