తెలంగాణలో మళ్ళీ పుంజుకుంటున్న తెలుగుదేశం పార్టీ

అచ్చంపేట నియోజకవర్గం పదర మండల అధ్యక్షుడు బొడ్డు రాజయ్య గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన పలువురు యువకులు చేరారు. వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ టి. మోపతయ్య గారు, ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆయన పేర్కొన్నారు.. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్, మీ కుటుంబం సల్లంగా ఉండాలే, మా బిడ్డలు రోడ్ల మీద బతకాలే, ఇదేనా బంగారు తెలంగాణ..? కష్టపడి డిగ్రీలు చదివిన నిరుద్యోగ యువకుల పరిస్థితి ఏంది అని ఆయన డిమాండ్ చేశారు..
ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని అని మోసం చేసిన కెసిఆర్ కి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో గుణపాఠం చెప్పడానికి తెలుగుదేశం పార్టీలో చేరిన యువకులకు కృతజ్ఞతలు తెలిపారు.. పార్టీలో చేరిన వారు వీరమోలి సురేష్, ఎడ్మ రమేష్, కనకట్టి సురేష్ ,మహేష్,అనకమోని రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో నగర మండల నాయకులు వెంకటయ్య, మండల అధ్యక్షులు ఆర్.కాశన్న, తెలుగు యువత నాయకులు B.ఆంజనేయులు,ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ M. తిమ్మయ్య, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు…