సీఎం కేసీఆర్ పై మండి పడ్డ రాములమ్మ

తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. దీనికి కారణం కెసిఆర్ ప్రభుత్వమే అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా..సీఎం కెసిఆర్ పై మరోసారి విజయశాంతి ఫైర్ అయింది. “జంటనగరాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకూ కురిసిన భారీ వర్షాలు ప్రజల్ని గతంలో ఎప్పుడూ లేనంత నిస్సహాయ పరిస్థితుల్లోకి నెట్టివేయడం కళ్ళారా చూశాం. వరదనీరు కాలువల్లా పారని వీధి లేదు… ఏరులై ప్రవహించని రోడ్డు లేదు. దశాబ్దాల కాలంగా నెలకొన్న ఈ దౌర్భాగ్య పరిస్థితికి గత ప్రభుత్వాలే కారణమని సీఎం కేసీఆర్ దొరగారు ఎన్నోమార్లు నిందించారు. ప్రకృతిని నియంత్రించడం మన వల్ల కాదు కానీ…. చినుకు పడితే చాలు చెదిరిపోయే జంటనగర ప్రజలను వరద కష్టాల నుంచి రక్షించేందుకు గడచిన మీ ఆరేళ్ళ పరిపాలనా కాలంలో ఏ కాస్తయినా చిత్తశుద్ధితో సేవ చేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు.