కరీంనగర్ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన జయశ్రీ
తెలంగాణ ఆత్మ గౌరవం, సంస్కృతి, సంప్రదాయనికి బతుకమ్మ పండుగ నిలువుటద్దం అని అన్నారు కరీంనగర్ కార్పొరేటర్, జిల్లా భాజపా మహిళా మోర్చా అధ్యక్షురాలు జయశ్రీ. చిన్న బతుకమ్మ పండుగ ఎంగిలి పులా బతుకమ్మ తో మొదలవుతుందని పేర్కొన్నారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయ ఎదుగుదలకు కల్వకుంట్ల కుటుంబం బతుకమ్మ పండుగను ఒక ఆయుడంలా వాడుకున్నారు అని విమర్శించారు. కవిత కోసం పండగ చేసినట్టు పాటలు రాయడం సిగ్గుపడాల్సిన విషయం అని అన్నారు. సంప్రదాయం పక్కన పెట్టి సమాజానికి ఏమి నేర్పిస్తారని ప్రశ్నించారు. జిల్లా, రాష్ట్రంలోని ప్రతి మహిళల ఆనందంగా పండగ జరుపుకోవాలని, అందరికి శుభాకాంక్షలు తెలిపారు.