గిద్దలూరు ప్రజలకు సాయం చేయండి : ఐవి రెడ్డి
విసృత్తంగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు వైకాపా నాయకులు ఐవి.రెడ్డి. గత మూడు రోజులు కురుస్తున్న వానల వల్ల గిద్దలూరు పట్టణంలో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని పేర్కొన్నారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను, ముంపు ప్రాంతాలను పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. అలాగే స్థానిక యువత, ఐవి రెడ్డి యువసేన సభ్యులు కూడా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.











