భాజపా నాయకుడు లక్ష్మణ్‌కి శుభాకాంక్షలు తెలిపిన లలిత
భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన కె.లక్ష్మణ్ నియమితులైనారు. ఈ సందర్భంగా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర మహిళా నాయకురాలు లలిత లక్ష్మణ్ కి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్రం నుండి అనేక మందికి పదవులు దక్కడం శుభసూచకమన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో వచ్చేది తమ పార్టీనేనని ధీమా వ్యక్తం చేశారు.