గిద్దలూరులో పొంగిపోర్లుతున్న సగిలేరు నది
గత రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల అన్ని సెలయేల్లు, చెరువులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. గిద్దలూరు పట్టణాన్ని అనుకొని ప్రవహిస్తున్న సగిలేరు నది విసృత్తంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లోని చెరువులు కుండా నిండిపోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సగిలేరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే తప్పా పట్టణానికి రాకుడదని అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైకాపా నాయకుడు ఐవి రెడ్డి ప్రజలకు సూచించారు.











