దుబ్బాక‌లో తెరాస‌కి క‌ష్ట‌మేనా ?

తెలంగాణ‌లో రాజ‌కీయ‌నాయ‌కులు, మేధావుల దృష్టంతా ఇప్పుడు దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గం మీద‌నే ఉన్నాయి. దుబ్బాక ఎమ్మెల్యే రాంలింగారెడ్డి ఆక‌స్మాతుగా చ‌నిపోవ‌డంతో ఉన ఎన్నిక అనివార్యమైంది. దీంతో మూడు పార్టీలు అక్క‌డ అధిప‌త్యం చెలియించాలని ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తున్నారు. కాగా అధికార పార్టీ తెరాస మాత్రం ధీమాతో ఉన్న‌ట్లు క‌నిపిస్తున్నా… క్షేత్ర స్థాయిలో వారికి స‌రైన బ‌లం లేద‌ని ప‌లు స‌ర్వేలు చెబుతున్నాయి. ప్ర‌ధానంగా గ్రామ‌ల్లో ఉన్న రైతులు పూర్తి నిరాశ‌తో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌ను సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డిస్తున్నారు. తెలంగాణ‌లో ఎక్క‌డ ఉప ఎన్నిక‌లు వ‌చ్చినా… ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంత్రి హారీష్‌రావుని రంగంలోకి దింపుతారు. కానీ ఇప్పుడు మంత్రికి క‌రోనా సోక‌డంతో ప్ర‌జ‌ల్ని నేరుగా క‌లిసే అవ‌కాశం లేదు. ప్ర‌భుత్వ నిబంధ‌ల ప్ర‌కారం చికిత్స తీసుకోవ‌డం లేదా ఇంటికే ప‌రిమితం కావాలి. ఒక‌వేళ కోలుకున్నా కానీ ప్ర‌జ‌ల్ని నేరుగా క‌లిస్తే వారికి క‌రోనా సోకే అవకాశం ఉంది.
అయితే ఇప్పుడు మంత్రి ఎలాంటి ఆలోచ‌న‌ల‌తో ముందుకు వెళ్తారు అనే సందేహం ప్ర‌జ‌ల్లో నెల‌కొంది. కానీ దుబ్బాక‌లో ప్ర‌తి ఒక్క‌రూ కూడా ర‌ఘునంద‌న్ గెలుస్తార‌ని చెబుతున్నారు.