పెళ్లి కావడం లేదని 2331 మంది ఆత్మహత్య
భారతదేశంలో ఆత్మహత్యలు రికార్డు క్రియేట్ చేశాయి. గత 11 ఏళ్లలో అత్యధిక ఆత్మహత్యలు 2019లో జరిగాయని జాతీయ నేర గణాంకాల మండలి (NCRB) నివేదికలు వెల్లడించాయి. పేదలు, తక్కువ చదువుకున్న వారే అధికంగా ఉన్నారు. బాధితుల్లో తెలుగు రాష్ట్రాల వారు 10 శాతంగా ఉన్నారు. పెళ్లీడొచ్చినా..వివాహం కావడం లేదని 2 వేల 331 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని నివేదికలో పొందుపరిచింది.
గత సంవత్సరం తెలంగాణలో 7 వేల 675 మంది, ఏపీలో 6 వేల 465 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తం ఆత్మహత్యల్లో 10 శాతం తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ నగరంలో 389 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు.
ప్రతి లక్ష మంది జనాభాకు ఆత్మహత్య చేసుకుంటున్న వారి జాతీయ సగటు 10.4 కాగా, తొలి 3 స్థానాల్లో ఛత్తీస్ గడ్ (26.4), కేరళ (24.3), తెలంగాణ (20.6) ఉన్నాయి.