తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ర్టేషన్ల నిలిపివేత

రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ర్టేషన్‌లను నిలిపివేస్తూ రెవెన్యూ (రిజిస్ర్టేషన్‌)శాఖ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుంచి అన్నిసబ్‌ రిజిస్ర్టార్‌కార్యాలయాల్లో భూముల, భవనాల రిజిస్ర్టేషన్‌లను నిలిపివేయనున్నారు. పౌరులకు నాణ్యమైన సేవలు అందించాలన్న ప్రధాన లక్ష్యంతో తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ రిజిస్ర్టేషన్‌లను నిలిపివేశారు. ఆస్తుల రిజిస్ర్టేషన్‌, డాక్యుమెంట్‌ల రూపకల్పనలో మార్పులు తీసుకు రావడం, అలాగే సాంకేతికంగా కొన్నిమార్పులను కూడా తీసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకూ రిజిస్ర్టేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ డిపార్ట్‌మెంట్‌లో కార్యకలాపాలను నిలిపి వేయాలని నిర్ణయించారు. తెలంగాణ రిజిస్ర్టేషన్‌ యాక్ట్‌, 1908 ప్రకారం రిజిస్ర్టార్‌ అండ్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో వీలునామాలు, మ్యారేజీలు, ఫ్రాంక్లిన్‌ సర్వీసులు మాత్రం యధావిధొగా రిజిస్ర్టేషన్‌ కొనసాగుతుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రెవెన్యూశాఖలో ఇటీవల వెలుగు చూసిన అవినీతి, అక్రమాల నేపధ్యంలో ఈశాఖను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించిన నేపధ్యంలో తాజాగా వెలువడిన రిజిస్ర్టేషన్‌ల నిలిపివేత ప్రాధాన్యత సంతరించుకుంది.