బీఏసీ స‌మావేశంలో భ‌ట్టి రాజేసిన విక్ర‌మార్క‌

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కాక‌ముందే కాంగ్రెస్, తెరాస‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగింది. సోమ‌వారం ప్రారంభ‌మైన స‌మావేశాలుల‌లో భాగంగా బీఏసీ స‌మావేశం జ‌రిగింది. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ బేటీలో వర్షాకాల సమావేశాల నిర్వహణపై చర్చించారు. సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశంతో పాటు ఏయే అంశాలపై సభ నడపాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 28 వరకు సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. ఈనెల 12, 13, 20, 27 తేదీల్లో శాసనసభకు సెలవులు ఇవ్వనున్నారు. మొత్తం 18రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. కాగా సీఎం కేసీఆర్‌, కాంగ్రెస్ ఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగిన‌ట్లు స‌మాచారం. అయితే బీఏసీలోనే ఈ విధంగా ఉంటే… స‌మావేశాల్లో ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవ‌చ్చు.