దుబ్బాకలో తెరాసకు కష్టమే ఇదే సాక్ష్యం
తెలంగాణలో ఇప్పుడు రాజకీయ నాయకులు, మేధావుల దృష్టి అంతా దుబ్బాక నియోజక వర్గం మీదనే. ఎట్టి పరిస్థితుల్లోనైన దుబ్బాకలో కారు జోరు మళ్లీ తీసుకురావాలని తెరాస, కమల వికాసం చేయాలని భాజపా పట్టుదలతో ఉన్నాయి. అయితే అధికార పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేసి ఖచ్చితంగా భాజపా జెండ ఏగరవేస్తామని రఘునందన్ రావు ధీమాతో ఉన్నారు. కాగా తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఉప ఎన్నికల్లో తెరాస విజయం సాధించింది. ఇందుకు కారణం మంత్రి హారీష్‌రావు వేసిన వ్యుహాలే కారణమని అంటున్నారు అధికార పార్టీ నేతలు. ఎలాంటి వారినైన తన గుప్పిట్లో పెట్టుకోవడం హారీష్‌రావుకి వెన్నతో పెట్టిన విద్య. కానీ ఇప్పుడు ఆ వ్యుహాలు ఫలిస్తాయా అన్నది సందేహాంగా మారింది.
ఇందుకు అనేక రకాల కారణాలు చెప్పుకోవచ్చు. ప్రధానంగా దుబ్బాకలో ఇప్పటి వరకు తెరాస నుంచి ఎవరికి టికెట్ వస్తుందో అనేది సందేహాంగా ఉంది. ఓ వైపు రాంలింగారెడ్డి తనయుడికే టికెట్ ఇవ్వాలని, మరో వైపు కవితా, ఇతర ఆశావాహులు ఉన్నారు. ఇందుల్లో క్లారిటీ రావాలంటే అధినేత నోరు విప్పాల్సిందే. మరోవైను మంత్రి హారీష్‌రావు కి కరోనా సోకడంతో ఇంటికే పరిమితం కావాల్సిందే. దీంతో ప్రజలను నేరుగా కలిసే అవకాశం లేకపోవడం కూడా తెరాసకు పెద్ద దెబ్బే. అయితే ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టిన భాజపాకు భారీ మద్దతు వస్తోంది. గ్రామాల్లో యువకులు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. అంతేకాకుండా చేగుంట, దౌల్తాబాద్ ఇతర పట్టణాలలో ప్రధాన నాయకులు ఇప్పటికే కమల తీర్ధం పుచ్చుకున్నారు. అయితే లక్ష మద్ధత్తు తమకి వస్తుందన్న సీఎం వ్యాఖ్యలు పైకి కనిపించేవని హెద్దవ చేస్తున్నారు భాజపా నేతలు.