ఆ ప‌ని కోసం క‌త్రినాకైఫ్ ఎన్ని డ‌బ్బులు తీసుకుందో తెలుసా?

మ‌ల్లీశ్వ‌రి సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టింది అందాల తార క‌త్రినాకైఫ్‌. విజ‌యభాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మ‌ల్లీశ్వ‌రి చిత్రంలో వెంక‌టేశ్‌, క‌త్రినాకైఫ్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. మీర్జాపూర్ యువ‌రాణి మ‌ల్లీశ్వ‌రి పాత్ర‌లో ఒదిగిపోయింది క‌త్రినాకైఫ్. కామెడీ, రొమాంటిక్ డ్రామాగా వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద భారీగా క‌లెక్ష‌న్ల వ‌సూలు చేసింది. వెంకీ, క‌త్రినా, బ్ర‌హ్మానందం మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్విస్తాయి. కేవ‌లం హిందీలో ఒక్క సినిమా చేసిన క‌త్రినాకైఫ్ కు మ‌ల్లీశ్వ‌రి చిత్రం కోసం భారీ మొత్తంలోనే రెమ్యున‌రేష‌న్ ఇచ్చార‌ట నిర్మాత‌లు. ఈ మూవీ కోసం క‌త్రినాను రూ. 70 ల‌క్ష‌లు చెక్కును అందించార‌ట‌. ఈ పారితోషికంతో అప్ప‌ట్లో సౌతిండియాలోనే అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకున్న న‌టిగా క‌త్రినాకైఫ్ నిలిచింది. ఆ త‌ర్వాత తెలుగులో అల్ల‌రి పిడుగులో న‌టించింది. క‌త్రినాకైఫ్ ప్ర‌స్తుతం అక్ష‌య్ కుమార్ తో క‌లిసి సూర్య‌వంశీ చిత్రంలో న‌టిస్తోంది.