ఫిజియోథెరపీతో కరోనాని జయించవచ్చు : డాక్టర్ ప్రశాంత్
వ్యాయామాలు చేయడం వల్ల కరోనాని కాస్త కట్టడి చేయవచ్చని అంటున్నారు కిమ్స్ ఐకాన్ ఫిజియోథెరపిప్ట్ డాక్టర్ ప్రశాంత్.
ఫిజియోథెరపీ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన ఈ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాయమాలు, ఫిజియోథెరపీ మీద అవగాహాన కల్పించడం కోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రస్తుత సమయంలో ప్రపంచంలోని అన్ని దేశాలు కోవిడ్-19 వైరస్‌తో పోరాడుతున్నాయి. ఈ వైరస్‌ని జయించడంలో ఫిజియోథెరపీలో చేసే వ్యాయమాలు కూడా కీలకంగా మారాయి. దగ్గు, జబులు, ఆయాసం, జ్వరం, నీరసం వంటివి కరోనాలో కనిపించే లక్షణాలు.
కరోనాని ఎలా జయించాలి
కరోనా సోకిన వ్యక్తి ఎక్కువగా శ్వాసకి సంబంధించిన సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఇందుకోసం ఫిజియోథెరపిస్టులు సూచించిన వ్యాయమాలు చేయడం వల్ల ఎక్కువశాతం కోలుకునే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా ఆయాసంతో బాధ పడుతున్నవారికి ఈ వ్యాయామాలు ఎంతోగానో ఉపయోగపడుతాయి అనడంలో ఎలాంటి సందేహాం లేదు.
మధ్యస్తమైన (మోడరేట్) ఆయాసం తో బాధ పడేవారు డియాఫర్గమాటిక్ లేక అబ్డోమినల్ బ్రీతింగ్ విధానం పాటించాలి. ఈ విధానంలో రోగి అనువైన స్థితిలో పడుకుని కానీ కూర్చుని కానీ ఈ వ్యాయామం చేయవచ్చు. రెండు చేతులను ఉదరం (పొట్ట)పైన ఆనించి దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి ఆ సమయంలో చేతులతో ఉదరం పైన కొద్దీగా వత్తిడి కలిగించాలి .తరువాత నెమ్మదిగా నోటితో గాలిని పూర్తిగా బయటకు వదిలి వేయాలి. ఈ విధంగా గంటకు 10 సార్లు చేయవలెను. వీటితో పాటు రోగి సామర్ధ్యం బట్టి స్పిరోమెట్రీ బెల్లోన్ ఉదట వంటి వ్యాయామాలు కూడా చేయవచ్చు. తీవ్రమైన ఆయాసంతో బాధ పడేవారు ఆక్సిజన్ లెవల్ 90 కంటే తక్కువ ఉన్న వారికి వెంటిలేటర్ సాయంతో ఆక్సిజన్ అందించటం తప్పని సరి.
కోవిడ్ వ్యాధి తగ్గి అసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత వీలైనంత విశ్రాంతి అవసరమైనప్పటికీ చాలా కొద్ది సమయం రోజు లో 2 నుంచి 3 సార్లు ఈ క్రింది వ్యాయామాలు చేయటం వలన శరీరం సాధారణ స్థితికి చేరుకుంటుంది.
*కుర్చీ లో కూర్చుని పైకి క్రిందకు లేవటం.
*పది నిమిషాలు పాటు నడవడం.
*మడమ పైన బరువు ఉంచి ముందు పాదం పైకి క్రిందకు కదపటం ముందు పాదం పైన బరువు ఉంచి పాదాలు పైకి క్రిందకు కదపటం
*2 నిముషాలు పాటు ఒంటి కాలి మీద నుంచోవటం. ఈ వ్యాయామాలు ఫీజియోథెరపిస్ట్ పర్యవేక్షణ లో చేయటం తప్పని సరి.