కరోనా రోగులు ఈ వ్యాయామాలు చేయండి : అర్షద్
ఈ ఫిజియోథెరపీ అనేది 1951లో సెప్టెంబర్ 8 న కౌన్సిల్ ఏర్పడిందని. కావున ప్రపంచ వ్యాప్తంగా ఫిజియోథెరపీ డేని సెప్టెంబర్ 8 నిర్వహిస్తున్నారని. 1996 నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బ్యాచిలర్ ఫిజియోథెరపీ, మాస్టర్స్ ఫిజియోథెపీ కోర్సులు ప్రారంభమైనవి తెలిపారు కిమ్స్ కర్నూలు ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ అర్షద్.
మారుతున్న జీవిన శైలిలో అనేక కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త రకలైన వ్యాధులు కూడా ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వైరస్ కోవిడ్-19. దీన్ని ఎదుర్కొడానికి ప్రపంచమంతా ప్రయత్నిస్తుంది. ఈ వ్యాధిపై పోరాటం చేయడంలో కీలక పాత్ర ఫిజియోథెరపీ అని చెప్పడంలో ఎటువంటి సందేహాం లేదు.
ఫిజియోథెరపీ ప్రాధాన్యత :
గత కొన్నినెలలుగా కరోనా వల్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగుల నుంచి చదువుకునే విద్యార్థుల వరకు ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమై, అనేక సమస్యలు తెచ్చుకుంటున్నారు. కార్యాలయాల్లో పని చేసే విధానం కంటే ఇంట్లో ఉండి పని చేసే విధానం చాల వ్యత్యాసం ఉంటుంది. దీని వల్ల శారీకంగా ఆరోగ్యంగా ఉన్నవారికి సైతం , మెడ, భుజం, నడుం, వెన్నుపూస నొప్పులు వంటి సమస్యలు వస్తున్నాయి. ప్రధానంగా మంచాలు, సోఫాల మీద కూర్చొని ల్యాప్టాప్లపై పనిచేయడం, గంటల తరబడి వాటిని చూస్తూ చదవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి.
ఈ రోజుల్లో ఫిజియోథెరపీ ప్రాధాన్యత వైద్యంలో కీలకంగా మారింది. చిన్న పిల్లల నుండి పెద్దవారు మరియు వృద్దుల వరకు ఈ ఫిజియోథెరపీ అవసరపుడుతుంది. ఈ థెరపీ వల్ల చాలా మంది కోలుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి.
ఆల్జీమర్, పార్కిన్సన్స్ డీసీజ్, పక్షవాతం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కార్డియో ఫల్మనరీ సమస్యలు, ఆర్థో, న్యూరాలజీ మొదలైన సమస్యలకు కూడా ఫిజియోథెరపీ వల్ల కోలుకుంటున్నారు. ఔషాదాలకు కూడా నయం కాని వ్యాధులకు చివరికి ఫిజియోథెరపీలను సంప్రదిస్తున్నారు. ఔషాదాలు లేకుండా శరీరాక సమస్యలకు ఫిజియోథెరపీ నుంచి పరిష్కారం లభిస్తోంది.
కరోనాని ఎలా జయించాలి
కరోనా మహమ్మారి కాలంలో ఆయా రోగులకు ఫిజియోథెరపీ అవసరం చాలా ఉంది. కోవిడ్-19 సోకినా, సాధారణ లక్షణాలు ఉన్న వారికి ఈ అవసరం చాల కీలకం. విటమిన్స్తో పాటు వ్యాయమాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కోవిడ్ రోగులకు శ్వాస తీసుకోనే వ్యాయామం చాలా అవసరం. ఆవిరి పట్టుకోవడం కూడా కీలకమైన అంశం.
- శ్వాస తీసుకునే వ్యాయామం
- ముక్కు ద్వారా 4 సెకన్ల పాటు గాలిని లోపలికి పీల్చుకొని, నిదానంగా నోటి ద్వారా 6 సెకన్ల పాటు బయటకు వదలాలి.
- ఇలా రోజులో 5 సార్లు పాటు చేయాలి, చేసిన ప్రతిసారి 10సార్లు ఈ వ్యాయామం చేయాలి.
- డాయాఫర్గమాటిక్ వ్యాయామం
- ఈ వ్యాయమంలో పొట్ట మీద ఒక చేయి పెట్టుకొని, ఛాతి మీద మరొ చెయి పెట్టుకొని లోతుగా ముక్కు ద్వారా శ్వాస తీసుకొని నోటి ద్వారా నెమ్మదిగా శ్వాస వదలాలి.
- ఇలా రోజులో 5 సార్లు చేయాలి, చేసిన ప్రతిసారి 10 సార్లు ఈ వ్యాయామం చేయాలి.
- 4-4-6 వ్యాయమం
- ఈ వ్యాయామాన్ని ఎలా చేయాలంటే ముక్కు ద్వారా 4 సెకన్ల పాటు శ్వాస తీసుకొని, 4 సెకన్ల పాటు శ్వాసని ఆపాలి. తరువాత నిదానంగా 6 సెకన్ల పాటు బయటికి వదలాలి.
- ఇలా రోజులో 5 సార్లు చేయాలి, చేసిన ప్రతిసారి 10 సార్లు ఈ వ్యాయామం చేయాలి.
- స్పైరో మీటర్ వ్యాయమం
స్పైరో మీటర్తో ఈ వ్యాయమం చేస్తారు. గాలిని గట్టిగా పీల్చుకొని బాక్స్ఃలో ఉన్న బంతులను 5 సెకన్ల పాటు ఆపాలి.
- ఇలా రోజులో 5 సార్లు చేయాలి, చేసిన ప్రతిసారి 20 సార్లు ఈ వ్యాయామం చేయాలి.
కరోనా సోకిన రోగికి ఈ పద్దతిలు సహాయపడుతాయి
కరోనా సోకిన వ్యక్తి ఈ పద్దతులు పాటించడం వల్ల రోగికి మంచి ఫలితం వస్తుంది. - ఛాతిని బెడ్ మీద వాల్చి (బోర్ల) పడుకోవాలి. దీనివల్ల ఊపిరితిత్తుల్లో ఉన్న కఫం బయటకు వస్తుంది.
- 30 నిమిషాల నుండి 2 గంటలకు వరుకు ఇలా నిద్రించాలి.
- తరువాత కుడివైపు తిరిగి 30 నిమిషాల నుండి 2 గంటల వరకు పడుకోవాలి.
- లేచిన తరువాత 30 నిమిషాల నుండి 2 గంటలకు వరకు కూర్చోవాలి.
- తరువాత ఎడమవైపు తిరిగి 30 నిమిషాల నుండి 2 గంటలకు పడుకోవాలి,
- తర్వాత మళ్లీ బోర్ల పడుకోవాలి.
మంచి నవ్వు కరోనాకి తోడ్పడుతుంది.
సాధారణంగా కరోనా వచ్చిన వారు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడిని జయించడానికి నవ్వు చాలా తొడ్పడుతుంది. దీనివల్ల మనిషి నవ్వినప్పుడు మెదడులో ఎండోఫిన్ అను పదార్ధం విడుదల అవుతుంది. దీని వల్ల మంచి ఉపశమపం దొరుకుతుంది. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.
ఇలాంటి వ్యాయామాలతో పాటు మంచి పౌష్టికాహారం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కోవిడ్-19 జయించవచ్చు.