కోవిడ్ రోగులకు ఫిజియోథెర‌పీ కీల‌కం

ప్ర‌తి సంవ‌త్సరం సెప్టెంబ‌ర్ 8వ తేదీన ప్ర‌పంచ ఫిజియోథెర‌పీ దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తారు. ఈ సంవ‌త్స‌రం థీమ్ రెహ‌బిలిటేష‌న్ మ‌రియు కోవిడ్‌-19 పేషెంట్స్ గా తీసుకున్నార‌ని కిమ్స్ సవీర వైద్యురాలు సాయి సుధా అన్నారు. ప్రస్తుతం ఉన్న కోవిడ్ మ‌హామ్మారి కాలంలో కోవిడ్ ప‌రీక్ష‌ల దృష్ట త‌లెత్తే ఆరోగ్య స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌డానికి ఫిజియోథెరపీ చ‌క్క‌టి ప‌రిష్కార మార్గం. ఫిజియోథెర‌పీ కండ‌రాల స‌మ‌స్య‌లు, ఎముక‌ల- కీళ్ల స‌మ‌స్య‌లు స‌ర్జ‌రీ త‌ర్వాత త‌లెత్తే న‌రాల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డంలో మెరుగైన ఫ‌లితాన్ని అందిస్తుంది.

ఫిజియోథెరపీ ప్రాధాన్యత
గత కొన్నినెలలుగా కరోనా వల్ల సాప్ట్వేర్ ఉద్యోగుల నుంచి చదువుకునే విద్యార్థుల వరకు ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమై, అనేక సమస్యలు తెచ్చుకుంటున్నారు. కార్యాలయాల్లో పని చేసే విధానం కంటే ఇంట్లో ఉండి పని చేసే విధానం చాల వ్యత్యాసం ఉంటుంది. దీని వల్ల శారీకంగా ఆరోగ్యంగా ఉన్నవారికి సైతం , మెడ, భుజం, నడుం, వెన్నుపూస నొప్పులు వంటి సమస్యలు వస్తున్నాయి. ప్రధానంగా మంచాలు, సోఫాల మీద కూర్చొని ల్యాప్టాప్లపై పనిచేయడం, గంటల తరబడి వాటిని చూస్తూ చదవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి.
ఈ రోజుల్లో ఫిజియోథెరపీ ప్రాధాన్యత వైద్యంలో కీలకంగా మారింది. చిన్న పిల్లల నుండి పెద్దవారు మరియు వృద్దుల వరకు ఈ ఫిజియోథెరపీ అవసరపుడుతుంది. ఈ థెరపీ వల్ల చాలా మంది కోలుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి.
ఆల్జీమర్, పార్కిన్సన్స్ డీసీజ్, పక్షవాతం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కార్డియో ఫల్మనరీ సమస్యలు, ఆర్థో, న్యూరాలజీ మొదలైన సమస్యలకు కూడా ఫిజియోథెరపీ వల్ల కోలుకుంటున్నారు. ఔషాదాలకు కూడా నయం కాని వ్యాధులకు చివరికి ఫిజియోథెరపీలను సంప్రదిస్తున్నారు. ఔషాదాలు లేకుండా శరీరాక సమస్యలకు ఫిజియోథెరపీ నుంచి పరిష్కారం లభిస్తోంది.
కోవిడ్‌-19 రోగుల‌కు శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌కు స్పైరో మీట‌ర్ శ్వాసక్రియ వ్యాయామాలు చేయ‌డానికి మ‌నం ఏ స‌మయంలోనైనా ఎక్క‌డైనా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాడుకునే ప‌రిక‌రం. కోవిడ్ రోగుల‌లో ఈ ప‌రిక‌రం ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల శ‌క్తిని పెంపొదిస్తుంది.
ఈ మ‌హ‌మ్మారి కాలంలో స్వ‌ల్ప‌కాలిక ల‌క్ష‌ణాలు ఉన్న కోవిడ్‌-19 రోగులంద‌రికీ ఒకేసారి శ్వాస వ్యాయామాలు, స్పైరో మీట‌ర్ వ్యాయామాలు చేయిస్తున్నాం. అలాగే స‌మ‌స్య తీవ్ర‌త ఎక్కువ ఉన్న‌వారికి ఒక్కొక్క‌రికి ఒక్కోసారి ఛాతి ఫిజియోథెరపీ చేయిస్తున్నాం.
ప్ర‌తి రోజు ప్ర‌తి ఒక్క‌రు రోజుకు రెండు సార్లు చొప్పున శ్వాస వ్యాయామాలు చేయాలి. దీనితో పాటు సూర్య న‌మ‌స్క‌రాలు కూడా చేయాలి. దీని వ‌ల‌న ఊపిరితిత్తుల‌కు శ‌క్తి పెరుగుతుంది. అలాగే రోగనిరోధ‌క‌శ‌క్తి కూడా పెరుగుతుంది. త‌ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకోవ‌చ్చు.