కరోనాని కట్టడి చేయాలంటే ఇవి తినాల్సిందే
కరోనా సమయంలో ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్ డైటీషియన్ దత్తు రాజు. ప్రజల అప్రమత్తతే వారి ప్రాణాలు కాపాడుతుందన్నారు. నేషనల్ న్యూట్రీషియన్ విక్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవజాత శిశువులకు మంచి ఆరోగ్యకరమైన పోషకాహారం అంటే మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలే. 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు తల్లిపాలకు తోడు సురక్షితమైన, పోషకాహారాన్ని కలిపి ఇస్తుంటారు. చిన్నపిల్లలకు ఆరోగ్యకరమైన, సమతుల ఆహారం అందితేనే వారి ఎదుగుదల, అభివృద్ధి సాధ్యం. ఇక పెద్దవారికి దీనివల్ల ఆరోగ్యంతో పాటు జీవితం క్రియాశీలకంగా ఉంటుందన్నారు. రోజూ ఒకే సమయానికి తినడం వల్ల శక్తిస్థాయి స్థిరంగా ఉంటుంది. బాగా ఎక్కువ, తక్కువ కాదు. దీనివల్ల శరీర లయ ఒక పద్ధతిలో ఉండి, తగినంత శక్తివంతంగా ఉండేందుకు అవసరమైన హార్మోన్లను తగినంత స్థాయిలో ఉంచుతుంది. సహజమైన పద్ధతికి దగ్గరగా ఉండే ఆహారం ఏదైనా, వీలైనం తక్కువగా వండి, ఆ కాలంలో దొరికేదైతే ఆరోగ్యానికి మంచిది. పోషకాలతో కూడిన ఆహారం ఆరోగ్యాన్ని ఇస్తుంది కానీ వండిన ఆహారం అయితే కేవలం కేలరీలను ఇస్తూ, తగినంత శక్తిని ఇవ్వవు. అందువల్ల నీరసంగా అనిపించి, అనేకరకాల వ్యాధులు రావచ్చు. పులియబెట్టిన ఆహారంలో మంచి బ్యాక్టీరియా ఉండి, పోషకాలు సమర్ధంగా అరిగేందుకు ఉపయోగపడుతుంది” అని వివరించారు.