పనిచేసే ఫ్యాక్టరీ మూసివేత-గుండె పోటుతో కార్మికుడి మృతి
ఓ వైపు కరోనా భారం, ఇంకో వైపు పని చేస్తున్న కంపెనీ ఆకస్మాత్తుగా ఆగిపోవడం, మరోవైపు అప్పుల బాధ ఇవన్ని ఆ యువకుడిని చలించివేశాయి. ఉన్న పొలం కాస్త కాళేశ్వరం కాలువలో కొట్టుకపోయింది. ఊరి దగ్గర్లో ఉన్న ఫార్మా కంపెనీ గత ఆరు నెలలుగా మూసివేయబడింది. దీంతో మనోవేదన గురైన 32 సంవత్సరాల కరుణాకర్ గుండె ఆకస్మాత్తుగా ఆగిపోయింది. ఇదంతా సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో జరిగింది. దీంతో జగదేకపూర్ గ్రామంలో విఫాదఛాయలు అలముకున్నాయి. మృతిడికి 7 సంవత్సరాలలోపు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కరుణాకర్ పని చేస్తున్న ఫార్మా కంపెనీ గత ఆరు నెలలుగా మూసివేయడంతో పని చేయడానికి ఎక్కడ పని లేక ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఫార్మ కంపెనీ యాజమాన్యల సమస్య వల్ల ఆ కంపెనీ మూసి వేసినట్లు సమాచారం. అయితే స్థానికులకు ఉపాధి కల్పిస్తున్న ఆ ఫార్మ కంపెనినీ తెరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.