పౌష్టికాహారంతో ఎన్నో లాభాలు : మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్‌

మ‌నిషి వ్యాధుల‌తో పోరాడేందుకు, ఇన్ఫెక్ష‌న్ల నుంచి బ‌య‌ట ప‌డేందుకు మ‌నం తీసుకునే ఆహార‌మే కీల‌కం. ఆరోగ్య‌క‌రమైన‌, పోష‌కాల‌తో కూడిన‌, స‌మ‌తుల ఆహారం తీసుకోవ‌డం ఈ మ‌హ‌మ్మారి స‌మ‌యంలో చాలా ముఖ్యమ‌ని అన్నారు క‌ర్నూలు మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్ డైటీషియ‌న్ ఏ. రవీంద్ర అన్నారు. క‌‌రోనా లాంటి వ్యాధుల‌తో మ‌న శ‌రీరంలోని రోగ‌నిరోధ‌క శ‌క్తి పోరాడాల్సి వ‌చ్చినప్పుడు మంచి పోష‌కాహారం, వ్యాయామం చాలా ముఖ్యం. తాజా ఆహారం అందుబాటులో లేక‌పోతే పోష‌కాలు త‌గినంత‌గా అంద‌వు. దానివ‌ల్ల బాగా ఎక్కువ‌గా వండిన ప‌దార్థాల‌ను పెద్ద‌మొత్తంలో తీసుకునే అవ‌కాశం ఉంటుంది. ఫ‌లితంగా అనారోగ్య‌క‌ర‌మైన కొవ్వులు, కొలెస్ట‌రాల్, షుగ‌ర్లు, ఉప్పు పెరుగుతాయి. అంతేకాదు, ప‌రిమిత వ‌న‌రుల‌తోనైనా మంచి ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని తీసుకోవ‌చ్చు.