కరీంనగర్ ప్రజల ఆరోగ్యమే మా లక్ష్యం : మెడికవర్
ఆరోగ్యకరమైన భారతదేశం కోసం మంచి ఆహారం అందించేదుకు “జాతీయ పోషకాహార వారోత్సవం 2020” చేసుకుంటున్నాం; మంచి పోషకాహారం తీసుకుంటే మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, గుండెవ్యాధులు.. ఇవేవీ దరిచేరవు. కరోనా వైరస్ రావడానికి చాలావరకు ఇవే కారణం. ఆరోగ్యకరమై, పోషకాహారం తీసుకోవడం ద్వారా చాలారకాల కేన్సర్లను కూడా నిరోధించవచ్చు.
నవజాత శిశువులకు మంచి ఆరోగ్యకరమైన పోషకాహారం అంటే మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలే. 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు తల్లిపాలకు తోడు సురక్షితమైన, పోషకాహారాన్ని కలిపి ఇస్తుంటారు. చిన్నపిల్లలకు ఆరోగ్యకరమైన, సమతుల ఆహారం అందితేనే వారి ఎదుగుదల, అభివృద్ధి సాధ్యం. ఇక పెద్దవారికి దీనివల్ల ఆరోగ్యంతో పాటు జీవితం క్రియాశీలకంగా ఉంటుంది.
ఆరోగ్యకరమైన ఆహారం ప్రాధాన్యం గురించి కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ డైటీషియన్ సునీత డైటీషన్మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తగినంత మొత్తంలో ధాన్యాలు, పప్పులు, కాలాల వారీగా దొరికే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవాలి, వాటితో పాటు చేపలు, స్కిన్‌లెస్ చికెన్ లాంటి మాంసాహార ఉత్పత్తులూ తగినంత మొత్తంలో తినాలి. ధాన్యాలు పప్పులు మన శరీరానికి తగినంత కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లను అందిస్తాయి. పండ్లు, కూరగాయలతో విటమిన్లు, ఖనిజాలు, పీచు, యాంటీఆక్సిడెంట్లు అందుతాయి. రోజువారీ ఆహారంలో కొన్ని పప్పుకాయలను కూడా చేర్చడం చాలా మంచి అలవాటు. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటితో పాటు నూనెగింజల వల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు, అరిగించే పీచు పదార్థాలు, ప్రోటీన్లు, ఇంకా చాలాముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. తగినంత నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, కొబ్బరినీళ్లు, మజ్జిగ, ఇంట్లో చేసిన సూప్‌లు, పుదీనా నీళ్లు, జీరానీళ్లు.. ఇలా పంచదార కలపని రకరకాల నీళ్లు తీసుకోవడం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. కొద్దిపాటి డీహైడ్రేషన్‌కు గురైనా శరీరం బాగా నీరసిస్తుంది.