కరోనా కట్టడికి పౌష్టికాహారంపై దృష్టి పెట్టండి : ఫర్వీన్ భాను
ప్రజల్లో పోషకాహారాల విలువల గురించి అవగాహాన పెంచడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్1 నుంచి 7 వరకు నేషనల్ న్యూట్రిషన్ వీక్ నిర్వహిస్తారని పేర్కొన్నారు కిమ్స్ కర్నూలు డైటిషీయన్ ఫర్వీన్ భాను. ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి కాలంలో ప్రజలు మంచి ఆహారం తీసుకోవడం వల్లే ఆరోగ్యంగా జీవించగలుగుతారని అన్నారు. ఇప్పటి వరకు ఎటువంటి వ్యాక్సిన్ రాకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురువుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పౌష్టికాహారం తీసుకోవాలి దీని ద్వారానే మనం కరోనాని జయించవచ్చు పేర్కొన్నారు. మానవ శరీరానికి పోషకాహారం చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ తమ పనిని సరిగ్గా మరియు కచ్చితంగా చేయగలగాలి అంటే పోషకాహారం తప్పినసరి. భారతదేశంలో నేడు చాలా మంది పోషకాహార లోపంతో ఉన్నారు మరియు వారి దృఢమైన శరీర పెరుగుదలకు సరైన ఆహారం అవసరమని తెలిపారు. కరోనా కట్టడికి వైద్యులు సూచించిన ఆహార నియమాలను పాటించాలన్నారు.