పౌష్టికాహారమే మనల్ని రక్షిస్తుంది : లావణ్య
మనం తీసుకునే పౌష్టికాహారమే మనల్ని రక్షిస్తుందని అన్నారు కిమ్స్ ఐకాన్ డైటిషీయన్ లావణ్య. నేషనల్ న్యూట్రిషీయన్ వీక్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల్లో పోషకాహారాల విలువల గురించి అవగాహాన పెంచడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్1 నుంచి 7 వరకు నేషనల్ న్యూట్రిషన్ వీక్ నిర్వహిస్తారని తెలిపారు. ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి కాలంలో ప్రజలు మంచి ఆహారం తీసుకోవడం వల్లే ఆరోగ్యంగా జీవించగలుగుతారు. ఇప్పటి వరకు ఎటువంటి వ్యాక్సిన్ రాకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురువుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పౌష్టికాహారం తీసుకోవాలి దీని ద్వారానే మనం కరోనాని జయించవచ్చన్నారు. మానవ శరీరానికి పోషకాహారం చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ తమ పనిని సరిగ్గా మరియు చేయగలగాలి అంటే పోషకాహారం తప్పినసరి. భారతదేశంలో నేడు చాలా మంది పోషకాహార లోపంతో ఉన్నారు మరియు వారి దృఢమైన శరీర పెరుగుదలకు సరైన ఆహారం అవసరం తెలిపారు.
ప్రస్తుతం కోవిడ్ రోగులు తీసుకోవాల్సిన ఆహార వివరాలు
- తాజాగా తయారుచేసిన వేడి ఆహారాన్ని తీసుకోవాలి
- రోగులలో చాలా మందికి తక్కువ ఆకలి ఉంటుంది కాబట్టి వారికి వేడి సూప్, పసుపు కొమ్ములుతో చేసిన రసం తరచుగా అందించాలి.
- ప్రతిరోజూ 8-10 గ్లాసుల నీరు తీసుకోవడం మంచిది.
- యాంటీ-ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ముఖ్యంగా బీటా కెరోటిన్ ఫుడ్స్, పాలకూర, క్యారెట్, గుమ్మడికాయ, క్యాప్సికమ్ తీసుకోవాలి .
- విటమిన్-సి అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్-సి యొక్క RDA (వైద్యుల సిఫార్సు ప్రకారం) రోజుకు 90mg
- విటమిన్-సి, (per100gm) ఉసిరి-600mg, జామా- 228mg, క్యాప్సికమ్- 80mg, ఆరెంజ్ & నిమ్మ- 53mg, క్యాబేజీ- 30mg, టొమాటో- 14mg, ఉల్లిపాయ- 7.4mg, క్యారెట్ & ఆపిల్- 6 మి.గ్రా.
- నిమ్మకాయ నీరు, సలాడ్లలో పచ్చి క్యాప్సికమ్, ఒలిచిన నారింజ లేదా బత్తాయి, తాజాగా కట్ చేసిన జామా కాయలు వంటివి తయారుచేసిన వెంటనే అందించాలి.
- విటమిన్-సి సున్నితమైనది కాబట్టి వంట చేయడం వల్ల కూరగాయలలోని విటమిన్-సి శాతం సుమారు 60% తగ్గుతుంది మరియు కడిగే సమయంలో ఆహారం నుండి విటమిన్-సి కోల్పోవచ్చు మరియు వివిధ ఆహార పదార్ధాలలో అవి నిల్వ చేయబడిన ఉష్ణోగ్రత భట్టి విటమిన్ -సి సాంధ్రతలు తగ్గుతాయి.
- ప్రోటీన్ల కోసం 2-4 ఉడికించిన గుడ్డులోని తెల్లసొన ప్రతి రోజు తీసుకోవాలని సిఫార్సు చేయబడింది.
- ఒక పిడికిలి డ్రై ప్రూట్స్ అందులో ఎక్కువుగా బాదం మరియు అక్రోట్ల ఉండాలి.
- కోరాడ్ -5 ఉన్న రోగులలో చాలా మందికి స్టెరాయిడ్స్ సలహా ఇస్తారు. స్టెరాయిడ్లు మధుమేహాన్ని మరింత తీవ్రత చేస్తున్నందున, తక్కువ గ్లైసి మిక్స్-ఇండెక్స్- ఆహారాలు బార్లీ వాటర్, వెజ్ సూప్, రాజ్మా చాట్ లేదా బొబ్బర్లు వంటివి స్నాక్స్ గా తీసుకోవాలి.
- తక్కువ కొవ్వు ఉన్న పాలు మరియు పాల ఉత్పత్తుల పదర్ధాలు రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.
- రోజు విడిచి రోజూ పాలలో (200 మి.లీ) పసుపు మరియు మిరియాలు పొడి వేసుకొని తీసుకోవాలి.
- ప్రతి రోజు ఆహారంలో రెండు సార్లు పెరుగు ఉండేలా చూసుకోవాలి, అందువలన జీర్ణవ్యవస్థలో మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది.
- అధిక యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీవైరల్ ఔషధాల వల్ల గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది, కాబట్టి నూనె పదార్థాలను ఆహారంలో నివారించాలి లేదా పరిమితం చేయాలి.
- అల్లం ఉప్మా వంటి అల్పాహారంలో, తులసి టీ రూపంలో వెల్లులి పప్పు తాలింపులో వేసుకోవాలి.
- యాంటీఆక్సిడెంట్ ,యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ ఇమ్యునోమోడ్యులేటరీ మరియు శ్వాసకోశ రక్షణ లక్షణాలను ప్రదర్శించే బయోయాక్టివ్ కాపౌండ్స్ వాటిలో ఉంటాయి.