ఆనాధలకు అండగా బ్లడ్ డోనర్ లైఫ్ సేవర్ ఫౌండేషన్
ఆనార్యోగంగా ఉన్న వారిని చేయుత నివ్వడమే కాదు ఆపదలో ఉన్న ఆనాధలన కూడా ఆదుకుంటామని మరో సారి రుజువు చేసింది బ్లడ్ డోనర్ లైఫ్ సేవర్ ఫౌండేషన్. కరోనా వల్ల అన్ని ఉన్నవారే అనేక ఇబ్బందులు పడ్డారు దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇక ఆనాధ ఆశ్రమాల వారు పడ్డ ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. వాటిని మాటలల్లో చెప్పలేము. కానీ వారికి చేయుత నిచ్చి మానవత్వం చాటుకుంది ఈ బ్లడ్ డోనర్ లైఫ్ సేవర్ ఫౌండేషన్. ఎల్‌బీ నగర్‌లో ఉన్న కాకతీయ వృద్ధాశ్రమం కరోనా వల్ల ఆశ్రమం అద్దె కట్టని పరిస్ధితుల్లో పడింది. ఈ విషయం బ్లడ్ డోనర్ లైఫ్ సేవర్ ఫౌండేషన్ నిర్వాహాకులు సునిల్‌కి తెలిసింది. దీంతో ఆయన వెంటనే తన సామాజిక మాధ్యమాల ద్వారా స్నేహితులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన ఆ చేతులు తోచిన సాయం చేశారు. ఆ 37500 రూపాయలను ఆశ్రమ నిర్వహాకులు అందజేసి, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు సునిల్. ఇలా సాయం చేయడం వల్ల వారి కష్టాల్లో పాలుపంచకున్న వారిలా ఉంటామని తెలిపారు.