2,000 నోటు ప్రింటింగ్‌కి బ్రేక్‌

దేశంలో రూ. 2,000 నోట్లను ముద్రించ‌డం లేద‌ని తేల్చి చెప్పింది రిజ్వ‌ర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గత కొద్ది సంవత్సరాలుగా అసలు ఈ నోట్ల చ‌ల‌మ‌ణి‌ కూడా తగ్గుతూ వస్తోందని నివేదిక పేర్కొంది. 2019 మార్చి చివరినాటికి చెలామణీలో ఉన్న రూ.2,000 కరెన్సీ నోట్ల సంఖ్య 33,632 లక్షలు. 2019 మార్చి నాటికి ఈ సంఖ్య 32,910 లక్షలకు తగ్గింది. 2020 మార్చి నాటికి మరింతగా 27,398 లక్షలకు పడిపోయింది. 2020 మార్చి చివరినాటికి మొత్తం నోట్ల పరిమాణంలో రూ.2,000 నోట్లు 2.4 శాతంగా ఉంది. 2018 మార్చి ముగిసేనాటికి ఇది 3.3 శాతం ఉంటే, 2019 మార్చి నాటికి 3 శాతానికి దిగివచ్చింది. ఇక విలువలు చూస్తే, మొత్తం నోట్ల విలువలో వీటి వాటా 2018 మార్చి నాటికి 37.3 శాతం. 2019 మార్చి నాటికి 31.2 శాతానికి దిగివచ్చింది. 2020 మార్చి నాటికి మరింతగా 22.6 శాతానికి తగ్గిపోయింది.