విటమిన్ డి లోపమా ?

విటమిన్ డి లోపం అనేక శారీరక మానసిక సమస్యలకు కారణమ‌వుతుంద‌ని అంటున్నారు డాక్ట‌ర్ స్రవంతి. పసి పిల్లల నుండి, పెద్ద వారి దాక ఈ సమస్య ఎవరినైనా వేదించవచ్చు పేర్కొన్నారు. దీని కారణంగా చర్మ సంబంధ సమస్యలు, జుట్టు రాలడం, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతయీ. ఇపుడు ఉన్న సిట్యుయేషనలో మనకు విటమిన్ డి చాలా అవసరం తెలిపారు. ఈ విట‌మిన్ కోసం ఆమె చెప్పే చిట్కాలు మీకోసం.
విటమిన్ డి సహజ సిద్ధంగా సూర్యరశ్మి ద్వారా ఇంకా విటమిన్ డి ఉన్న ఆహరం తీసుకోవడం వల్ల లభిస్తుంది.
ఇపుడెందుకు విటమిన్ డి గురించి చెప్పాల్సి వస్తుందంటే ఇన్ని రోజుల పరిస్థితుల ప్రభావం వల్ల అందరం ఇంట్లోనే ఉంది పోవాల్సి వచ్చింది అందువల్ల సూర్యరశ్మి మన ఒంటి మీద పడడం తగ్గి పోయింది అందువల్ల ప్రతి ఒక్కరిలో విటమిన్ డి లోపం కనిపిస్తుంది.
ఇపుడు ఉన్న వైరస్ సోకితే విటమిన్ డి లోపం వల్ల తొందరగా కోలుకోలేకపోతున్నారు కాబట్టి మనం అందరం విటమిన్ డి అందేలా చూసుకోవాలి.
సూర్యరశ్మి కిరణాలు
ప్రొద్దున 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల లోపు సూర్య కిరణాలు ప్రకాశవంతంగా ఉంటాయి కాబట్టి ఈ టైం లో మన మీద ఎండా పడేలా చూసుకోవాలి. తెల్లగా ఉన్న వాళ్లకు ఐతే 15 నిముషాలు కొంచెం చామంచాయ నలుపుగా ఉన్నవాళ్లు 20 నుంచి 25 నిముషాలు ఉండాలో ఉండాలి మరీ అతిగా ఉండకూడదు.
విటమిన్ డి ఉన్న ఆహరం
చాపలు, గుడ్లు, పుట్టగొడుగులు, పాలు, చీజ్, పెరుగు, మటన్ లివర్, ఆరంజ్ జ్యూస్, సొయా పదార్థాలు, బాదాం లేక బాదాం పాలు, ఓట్స్, సాబుదానా, బార్లీ గింజలు, గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, బ్రౌన్ రైస్, శనగలు, పచ్చి బఠాణీ, బీన్స్, అటుకులు, గుమ్మడికాయ గింజలు, అవిసె గింజలు, సబ్జా గింజలు, సన్ఫ్లవర్ గింజలు.
విటమిన్ డి లోపం మరీ ఎక్కువగా ఉంటె విటమిన్ డి మందులు కూడా వాడొచ్చు దీనికి డాక్టర్ ని సంప్రదించగలరు…
కాబట్టి ప్రతి ఒక్కరు విటమిన్ డి ఉన్న ఆహరంతో పాటు సూర్యరశ్మి కిరణాలు పడేట్టు చూసుకోండి జాగ్రత్తగా ఉండండి…స్టే సేఫ్.. స్టే హెల్త్‌.