సోష‌ల్ మీడియాలో ర‌ఘ‌న్నకి పెరుగుతున్న మ‌ద్ద‌తు

దుబ్బాక ఉప ఎన్నిక‌లు తేదీలు ఖ‌రారు కాక‌ముందే భారతీయ జ‌న‌తా పార్టీ నాయ‌కుడు ర‌ఘునంద‌న్ రావుకి యువ‌త నుంచి మ‌ద్ద‌తు వ‌ర‌దాలా పారుతోంది. ఎన్నిక‌ల క‌మిష‌న్ ఇంకా తేదీలు కూడా ఖారారు చేయ‌కముందే సోష‌ల్ మీడియాలో భారీగా అత‌నికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నారు యువ‌త‌. గ‌తంలో అనుకొని విధంగా ఓట‌మి చ‌వి చూసినా.. ఈ సారి మాత్రం త‌ప్ప‌కుండా విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో పార్టీ ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఓ వైపు క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఇప్ప‌టికే ఎటువంటి స‌భ‌లు, స‌మావేశాల‌కు అనుమ‌తి లేకుండా పోయింది. ఒక‌వేళా ఉప ఎన్నిక‌ల తేదీలు ఖ‌రారు అయితే మాత్రం త‌ప్ప‌కుండా ప్ర‌చారం జోరుగా చేయాల‌నే ఉద్దేశంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. దుబ్బాకనే కాకుండా పోరుగు జిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాల నుండి కూడా భారీగా యువ‌త పాల్గొని ప్ర‌చారం చేయ‌నున్న్లు స‌మాచారం. న‌ల్లొండ‌, సూర్య‌పేట‌, ఖ‌మ్మం, మెద‌క, సిద్ధిపేట‌, సంగారెడ్డి, జ‌హీర‌బాద్ ప్రాంతాల నుండి యువ‌త ప్ర‌చారం బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది.
అయితే ఇప్ప‌డు ర‌ఘునంద‌న్‌రావుకి ఇంత మేరా మ‌ద్ద‌తు ప‌ల‌క‌డుడంతో ఖ‌చ్చితంగా ఎన్నిక‌ల్లో ఈ సారి విజ‌యం వరిస్తుంద‌ని ఆశ‌భావం వ్య‌క్తం చేస్తున్నారు. ఏదీ ఏమైన‌ప్ప‌టికీ ఎన్నిక‌ల తేదీలు ఖరారు కావ‌డం, ప్ర‌చారం ఎలా జ‌రుగుతుందో వేచి చూడాల్సిందే.