హిందువులు అంటే అంత కక్ష ఎందుకు మీకు : అరుణ
కెసిఆర్ ప్రభుత్వ హిందూ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదని మండి పడ్డారు సిద్దిపేట జిల్లా భాజపా మహిళా మోర్చా అధ్యక్షురాలు గాడిపల్లి అరుణ. రాష్ట్రంలో హిందువులను కించపరిచేలా వినాయక చవితి పండుగ చేశారు ధ్వజమెత్తారు.
ప్రజలందరూ కరోనా మహమ్మారి పై పోరాడుతున్న వేళ లాక్ డౌన్ సమయంలో వచ్చిన అన్ని పండుగలను నిబంధనలు పాటిస్తూ వి హెచ్ పి నిర్ణయం మేరకు హిందువులు అందరు ఇంటి వద్దనే జరుపుకున్నాము. కాని అత్యంత వైభవంగా జరుపుకునే బోనాల పండుగ మరియు వినాయక చవితి ఉత్సవాలను పీఠాధిపతులు సాధుసంతులు మరియు ఆధ్యాత్మిక వెతల సూచనల మేరకు సమాజ సంక్షేమం ఆకాంక్షిస్తూ కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూ జరుపుకోవాలని విశ్వహిందూ పరిషత్ కోరడ మైనది. ప్రభుత్వం యొక్క బాధ్యతారహితమైన మరియు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్న వేల ప్రజల ఆరోగ్యమును దృష్టిలో పెట్టుకుని నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ సామూహిక నిమజ్జనం జరుప రాదని భావిస్తూ పిలుపు ఇవ్వడం జరిగినది. ప్రభుత్వం తో కూడా రెండు దఫాలుగా చర్చలు జరిపింది. ప్రభుత్వం కూడా ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పడం జరిగింది. కానీ ఇందుకు భిన్నంగా అన్ని జిల్లాల్లో ఉత్సవాలకు ఎవరైనా మండపాలు ఏర్పాటు చేసినట్లయితే ఎపిడమిక్ యాక్ట్ మరియు డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించడం జరిగినది. మండప నిర్వాహకులను బెదిరిస్తూ కమ్యూనల్ షీట్స్ తెరుస్తామని మరియు రౌడీ షీట్ పెడదామని బెదిరించారు. ఈ రోజు దీనికి వ్యతిరేకంగా రాష్ట్రమంతటా నిరసన తెలుపుతూ సిద్దిపేట జిల్లాలొ అంతటా నిరసనలు తెలపడం జరిగింది విఘ్నాలు తొలగి పోవాలని కోరుతూ చెసే వినాయకుని పూజకు అంతట విఘ్నాలు కలిగిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక చర్యలను మరియు పోలీసుల దాడులను ఖండిస్తూ ఈ నిరసనలు ద్వారా తెలియ చేస్తున్నాము. వినాయక చవితి ఉత్సవాలు జరపడంలో ఒక సామాజిక దృక్పథం కూడా వుంది. ఎన్నో వేలమంది అర్చకులు మరియు లక్షల మందికి వినాయకుల తయారీ దారులు వలస కూలీలు కు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందనే ధ్యాసె ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఈ సందర్భంగా ఉపాధి కోల్పోయిన వారందరికీ కూడా ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాను. రంజాన్ మరియు బక్రీద్ పండుగలకు దగ్గర ఉండి నిబంధనలకు వ్యతిరేకంగా బారికెడ్స్ ఏర్పాటు చేసి సామూహిక ప్రార్థనలు అనుమతించిన ఈ ప్రభుత్వం మరియు పోలీసు శాఖ హిందువుల పండుగలు మాత్రం ఆంక్షలతో అణచి వేసే కుట్రలకు పాల్పడుతున్నది. ఈ విధమైన చర్యలను ఖండిస్తూ దుశ్చర్యలకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్వాహకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ, వినాయక చవితి ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకునే విధంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూనాం. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజారాం, వి హెచ్ పి ప్రచార ప్రముక్ బోయిని అశోక్ .. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడూరి నరేష్.. బీజేపీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు పత్రి శ్రీనివాస్ యాదవ్ … బి జె వై ఎమ్ సిద్ధిపేట పట్టణ అధ్యక్షుడు తాటికొండ శ్రీనివాస్ ఎబివిపి సిద్దిపేట పట్టణ ఉప అధ్యక్షుడు వంశీ బోనగిరి నాగరాజు సాంద్రకరి దినేష్ ప్రసాద్ మరియు మండపాల నిర్వాహకులు …కార్యకర్తలు పాల్గొన్నారు