ఇవి పాటిస్తే కరోన మీదరికి చేరదు : డాక్టర్ స్రవంతి
రోజురోజుకి విస్తరిస్తున్న కరోనా వైరస్ ని కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా ఈ వైరస్ లక్షణాలు తెలుసుకుంటే దాని నుండి దూరంగా ఉండొచ్చు. కరోనా అంటేనే ప్రజలు గజగజ వణికిపోతున్నారు భయపడడం మానేసి ఎలా వస్తుంది ఏమి చేయాలో ప్రముఖ డాక్టర్ స్రవంతి చెప్పే చిట్కాలు చూద్దాం.
కరోనా లక్షణాలు:
దీని లక్షణాలు ఒక్కో విధంగా ఉంటాయి. జలుబు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతుండడమే కాకుండా మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి.
1) తల నొప్పి 2) దగ్గు 3) జ్వరం 4) మోకాలి నొప్పులు 5) పూర్తిగా అనారోగ్యం.
ఎలా వ్యాపిస్తుందంటే:
కరోనా వైరస్ వ్యాపించడానికి అనేక కారణాలు ఉంటాయి..
- సాధారణంగా ఒక మనిషి నుండి మరో మనిషికి ఈ వైరస్ వ్యాపిస్తుంది.
- ఇది దగ్గు, తుమ్మినప్పుడు కూడా ఆ తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది.
- శారీరక సంబంధం ఉంటె ఈ వైరస్ వ్యాపిస్తుంది, అదే విధంగా స్పర్శ, షేక్ హ్యాండ్ వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
- వైరస్ కలిగిన పదార్దాన్ని ముట్టుకున్నా అనంతరం చేతులను శుభ్రం చేసుకోకుండా శరీర భాగాలను తాకినా వ్యాపిస్తుంది.
చికిత్స విధానం: - వైరస్ సోకిందని అనుమానంగా ఉంటె ముందుగా వైద్యుల దగ్గరికి వెళ్ళాలి.
- తలనొప్పి, జ్వరం, దగ్గుకు మెడిసిన్ తీసుకోవచ్చు.
- ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి.
- గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఉండాలి.
- మూడు గంటలకు ఒకసారి ఆవిరి పట్టాలి (వేడి నీళ్లలో పసుపు వేసుకొని)
- వీలయితే యిలాచ్చి, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, అల్లం, పుదీనా, తులసి, పసుపు కాషాయం తాగొచ్చు.
- ఎప్పటికప్పుడు చేతులను సబ్బు నీటితో కడగాలి.
- మీ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి.