స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌లో సిద్ద‌పేట 27వ ‌స్థానం

చెప్పుకుంటున్న సిద్ధిపేట జిల్లా 27వ స్థానం ద‌క్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి గాను స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 అవార్డులను ప్రకటించింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ అవార్డులను వెల్లడించారు. దేశంలో అత్యంత క్లీనెస్ట్ సిటీగా మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్ నిలిచింది. వరుసగా నాలుగోసారి ఇండోర్‌‌ ఈ ఘనతను సాధించింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. నేషనల్ లెవల్ మెగా సిటీ ఇన్ సిటిజన్‌ అవార్డుకు గ్రేటర్ హైదరాబాద్ (40 లక్షల పైచిలుకు జనాభాతో) దక్కించుకుంది. జాతీయ వ్యాప్తంగా బెస్ట్ మున్సిపాలిటీగా కరీంనగర్ నిలిచింది. జనాభాలో అత్యంత వేగంగా ఉన్న సిటీగా జహీరాబాద్ (50 వేల నుంచి లక్షకు చేరుకున్న జనాభా) బెస్ట్ ఫాస్టెస్ట్ మూవర్ అవార్డును గెల్చుకుంది. మేడ్చల్ (25 వేల నుంచి 50 వేల జనాభా) సౌత్‌ జోన్‌లో క్లీనెస్ట్‌ సిటీగా సగర్వంగా నిలిచింది.
స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో 100 యూఎల్‌బీలతో తెలంగాణ 8వ స్థానంతో సరిపెట్టుకుంది. నేషనల్ ర్యాంకింగ్‌లో గ్రేటర్ హైదరాబాద్‌ 23వ స్థానానికి పరిమితమైంది. నేషనల్ ర్యాంకింగ్‌ (1 లక్ష నుంచి 10 లక్షల పాపులేషన్‌లో) కరీంనగర్ 72వ ప్లేస్‌లో నిలిచింది. నిజామాబాద్‌ 133వ ర్యాంకు దక్కించుకుంది. జోనల్ ర్యాంకింగ్స్ (50 వేల నుంచి 1 లక్ష జనాభా)లో రాష్ట్రంలో సిరిసిల్ల 16వ ర్యాంకు, జహీరాబాద్ 31, గద్వాల్ 38, బోడుప్పల్ 42, వనపర్తి 51 ర్యాంకుల్లో నిలిచాయి. జోనల్ ర్యాంకింగ్స్ (25 వేల నుంచి 50 వేల జనాభా)లో హుజూర్‌‌నగర్ 9వ స్థానం, షాద్‌నగర్ 15, మెదక్ 24, కల్వకుర్తి 26వ పొజిషన్‌లో నిలిచాయి.