అవన్ని తప్పుడే వార్తలే : రేవంత్ రెడ్డి
సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఓ కథనంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ కథనం తనను విస్మయానికి గురిచేసిందన్నారు. ప్రజా జీవితంలో చురుకైన పాత్ర పోషిస్తున్నప్పుడు ఎదుగుదలను చూసి ఓర్వలేని ప్రత్యర్థులే ఇలాంటి కథనాలను వండి వారుస్తారని దుయ్యబట్టారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రాబల్యం పెరగడంతో లేనిపోని కథనాలను ప్రచారం చేయడం తేలికైపోయిందని అన్నారు. ఇలాంటి కథనాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు రేవంత్.
ఇంతకీ ఆ కథనం ఏంటంటే? రేవంత్ రెడ్డి ప్రియాంకాగాంధీ వర్గంలో చేరారని.. ఆమె నాయకత్వాన్ని రేవంత్ బలపర్చుతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అయింది. అది కాస్త రేవంత్ దృష్టికి వచ్చింది. దీంతో ఆయన స్పందించారు. ఆ కథనం పూర్తి అవాస్తమన్నారు. కాంగ్రెస్‌లో ఎలాంటి గ్రూపులు లేవన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలోనే తాము పనిచేస్తున్నట్లు రేవంత్ స్పష్టం చేశారు.