మీ పొట్టను ఇలా తగ్గించండి : స‌్రవంతి
మీ పొట్ట మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా… నలుగురిలోకి వెళ్లాలంటే సిగ్గుపడుతున్నారా. అయితే ప్రముఖ వైద్యురాలు స్రవంతి చెప్పినట్టు చేస్తే మీ పొట్టను తగ్గించవచ్చు. ఆ సూచనలేంటో తెలుసుకోవాలంటే ఇక చదవండి. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించే నాలుగు రకాల ఆహార పదార్ధాలను నిపుణులు సూచించారు. వీటిని కొన్ని నెలలపాటు క్రమం తప్పకుండా తీసుకుంటే పొట్ట దగ్గర కొవ్వు కరిగిపోతుందని చెబుతున్నారు.
1.పెసర్లు..
బాడీలో ఉన్న కొలెస్ట్రాల్‌ను కరిగించి, అధిక బరువును తగ్గించడంలో పెసర్లు ప్రముఖపాత్ర పోషిస్తాయి. వీటిలో విటమిన్ ఏ, బీ, సీ,ఈతోపాటు అనేక ఖనిజ లవణాలు ఉంటాయి. ఇవి కొవ్వును కరిగిస్తాయి. నిత్యం ఒక కప్పు పెసర్లను ఉడకబెట్టుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది.
2.వాము
అధిక బరువును తగ్గించుకునేందుకు వాము బాగా ఉపయోగపడుతుంది. ఒక లీటర్ నీటిని తీసుకుని అందులో ఒక టీ స్పూన్ వాము వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని చల్చార్చి రోజులో కొద్దికొద్దిగా తాగుతూ ఉండాలి. దీంతో చాలా త్వరగా బరువు తగ్గుతారు. పొట్ట దగ్గర కొవ్వు వేగంగా కరుగుతుంది.
- సబ్జా గింజలు..
బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో సబ్జా గింజలు ప్రధానపాత్ర పోషిస్తాయి. ఇందులో విటమిన్ ఏ,ఈ,కే,బీలు ఉంటాయి.అలాగే, డైటరీ ఫైబర్, కాపర్, క్యాల్షియం, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి పోషణను అందిస్తాయి. బాడీని డిటాక్సిఫై చేస్తాయి. తద్వారా అధిక బరువును తగ్గిస్తాయి.
4.గోధుమ రవ్వ ఉప్మా..
చాలామంది ఇష్టంగా తినే గోధుమ రవ్వ ఉప్మాకు అధిక బరువును తగ్గించే విశేష గుణముంది. దీన్ని రోజులో ఏదో ఒక పూట తినాలి. నిత్యం తీసుకునే ఆహారానికి ప్రత్యామ్నాయంగా దీన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్ శరీరానికి ఎంత అవసరమో అంతే ఉంటాయి. దీంతో బరువు పెరగరు.