సొంత రిజ్వర్ బ్యాంకు పెట్టుకున్న నిత్యానంద
వివాదాస్పద స్వామిజీ నిత్యానంద సొంత బ్యాంక్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. తన దేశంగా చెప్పుకుంటున్న కైలాస ద్వీపంలో ఈ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తామని అతడు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ఈ నెల 22న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. అదే రోజు ఆర్బీకే కరెన్సీ చలామణిలో ఉంటుందని నిత్యానంద పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పలు దేశాల బ్యాంకులతో చట్టబద్దంగా ఎంఓయూ కుదుర్చుకున్నట్లు అతడు స్పష్టం చేశారు. ఏ దేశ కరెన్సీ అయినా కైలాస దేశంలో చెల్లుబాటు అవుతుందని, అలాగే కైలాస దేశం కరెన్సీ కూడా అన్ని దేశాల్లో చెల్లుబాటు అవుతుందని వెల్లడించారు. కరెన్సీ రూపు రేఖలు, విధి విధానాలు 22న ప్రకటిస్తామని నిత్యానంద తెలిపారు. ఇదిలా ఉంటే నిత్యానంద కరెన్సీగా ఇప్పటికే కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతున్నాయి.