కోలగట్ల ఇంట్లో సందడి చేసిన ఉప ముఖ్యమంత్రి, మంత్రులు
విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో ఏపీ ఉపముఖ్యమంత్రి, మంత్రులు సందడి చేశారు. దీంతో విజయనగరంలోని ఎమ్మెల్యే ఇంట్లో కోలహాలం నెలకొంది. ఈ సందర్భంగా వీరభధ్రస్వామి తమ కుటుంబ సభ్యులను ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పేర్ని నాని, ఎమ్మెల్యే కొడాలి నానికి పరిచయం చేశారు. వారి కుటుంబ సభ్యుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విజయనగరం జిల్లాకు మంచి భవిష్యత్తు ఉందని ధర్మాన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కోలగట్ల కుటుంబం విజయనగరం అభివృద్ధి కీలక పాత్ర పోషించాలని అన్నారు. అలాగే కోలగట్ల శ్రావణి భవిష్యత్ వారసురాలిగా పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ రావు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.