కేటీఆర్‌కి పట్టం కట్టడానికేనా ఆ సమావేశం
రానున్న రోజుల్ల్లో తెలంగాణకు కేటీఆర్ సీఎం అయ్యోలా ఉన్నారని ఆరోపించారు తెలంగాణ జన సమితి మెదక్ జిల్లా యువజన నాయకుడు రాజశేఖర్‌రెడ్డి. రాష్ట్రంలోనే అందుబాటులో సీఎం ఉన్నా… ‘కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ’ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం చంద్రబాబుపై అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు నాటి హోం మినిస్టర్ దేవేందర్ గౌడ్ సెక్రటేరియట్ లో మంత్రులతో మీటింగ్ నిర్వహించారని గుర్తు చేశారు. వైఎస్సార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కనిపించడం లేదని వార్త తెలిసినప్పుడు నాటి ఫైనాన్స్ మినిస్టర్ రోశయ్య క్యాంపు ఆఫీసులో మంత్రులతో మీటింగ్ పెట్టారు. తొలి ప్రభుత్వంలో కేసీఆర్ చైనా, సింగపూర్, మలేషియా టూర్ వెళ్లినప్పుడు ఆయన వద్ద ఉన్న శాఖలను డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి అప్పగించారు. కానీ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఇలా ఒక మంత్రి ఆధ్వర్యంలో మంత్రులంతా సమావేశమైన సందర్భాలు లేవు. సీఎం కేసీఆర్ అందుబాటులో ఉండగా.. కేటీఆర్ కేబినెట్ మంత్రులందరినీ సమావేశపరిచిన తీరు.. అన్ని రాజకీయ పక్షాలను, రాజ్యాంగ నిపుణులను విస్మయానికి గురిచేసేలా ఉందిన్నారు. తెలంగాణకు షాడో సీఎం కేటీఆర్ అని అభివనర్ణించారు ఆయన.