మాస్క్ వాడితే మచ్చలు వస్తున్నాయా ఇలా ట్రై చేయండి : డాక్టర్ స్రవంతి
మాస్క్ అంటే తెలియని వాళ్లు కూడా ఇప్పుడు మాస్కులు ధరించాల్సి వచ్చింది. కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఫేస్‌మాస్క్ తప్పనిసరి. ఎక్కువసేపు మాస్క్ ధరించడం వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు లాంటి సమస్యలు మహిళలను వేధిస్తున్నాయి. వాటి నుంచి విముక్తి పొందాలంటే మాస్క్ వాడడం ఆపేయాలి. అది కుదరని పని కాబట్టి మనకు ప్రముఖ వైద్యురాలు స్రవంతి కొన్ని చిట్కాలు చెబుతోంది. అవి ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు.
- మాస్క్ పెట్టుకున్న కాసేపటికే ముక్కు, మూతి భాగంలో చెమట పట్టేస్తుంది. దానిని తుడుచుకునేందుకు లేదంటే గాలి తాకేలా చేసేందుకు మాస్క్‌ను కిందకి పైకి అంటుంటారు. ఇన్ని తిప్పలు ఎందుకునే అనుకుంటే శరీరానికి నప్పే ఫ్యాబ్రిక్‌తో చేసిన మాస్క్‌ను వాడడం ఉత్తమం. అలాగే వాతావరణానికి తగినట్లుగా గాలి తగిలేలా చూసుకుంటే సరిపోతుంది.
- సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్లు ప్రతినాలుగు గంటకు ఒకసారి మాస్క్‌ను మార్చుకుంటూ ఉండాలి. మాస్క్ పెట్టుకున్న తర్వాత కదలకుండా ఉండాలంటే ఫేస్ షీల్డ్ పెట్టుకోవాలి.
- మాస్క్‌ను వాడిన ప్రతీసారి ఉతకాల్సిన అవసరం లేదు. మాస్క్‌ను వాడిన ప్రతి నాలుగు గంటలకు ఒకసారి సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో మాస్క్‌ను ఉంచాలి. ఇలా ఒకటి, రెండు మాస్కులు కాకుండా ఐదారు తీసిపెట్టుకుంటే సరిపోతుంది. డైలీ 3 మాస్కులు అలా సరిపోతుంది. బయటకు వెళ్లకుంటే అది కూడా అవసరం లేదు.
- ఫేస్‌మాస్క్ ఎక్కువసేపు వాడడం వల్ల యాక్నే వస్తుంది. దీనిని తొలిగించుకోవాలంటే.. క్లియరసెంట్ అప్లై చేయాలి. లేదంటే గంధం చెక్కని అరగదీసి యాక్నేఏర్పడిన ప్రదేశంలో రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.