అనాధా వృద్దులకు ఆయన పెద్ద కొడుకు
ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. నా అనే వాళ్లు ఉన్నా… ఏనాడు కూడా కడుపునిండా తిండి పెట్టని కటిక మనుసు మీద విరక్తి చెంది. ఎవరో నెలకొల్పిన వృద్ధశ్రామంలో సేద తీరుతున్నారు. ఇప్పుడు అసలే కరోనా కష్ట కాలం. మాములగానే ఆశ్రమాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటి సమయంలో మరీ ఎక్కువ… కానీ ఈ కష్టకాలంలో కూడా వారిని సొంత మనుషులుగా చూస్తూ దగ్గరుండి వారికి అన్నం పెడుతున్న గొప్ప మనుసు గల మనిషి ఆయన. ఆయనే చ్ంద్రాయణగుట్ట ఎస్.ఐ జకీర్.
ఇప్పటికే ఎన్నో సార్లు ఎంతో మందికి చేయుత ఇచ్చారో తెలియదు కానీ ఆనాథ వృద్ధులంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ. ఎక్కడ ముసలి వాళ్లు కనిపించిన ఆయన మనసు విలవిలాడిపోతుంది. తన ఇద్దరి పిల్లల పుట్టిన రోజులను పండుగలను ఆనాధ వృద్ధాశ్రామాల్లోనే చేస్తారు. మనకి అందరూ ఉంటారు పాపం వారికి ఎవరూ లేరు. అందురూ ఉంటారు కానీ వారు అనాధలంటారు. వారికి ఆ లోటు రాకుండా చేయడంలో ఉన్న ఆనందం దేంట్లో లేదంటారు జకీర్ భయ్యా. ఫలక్‌నామ ప్యాలెస్ దగ్గరలోని ఫాతిమా వృద్ధాశ్రమంలో జకీర్ భయ్యా.. తన చేతులతో వారికి అన్నదానం చేశారు. రోజంతా వారికి కావాల్సిన సహాయం చేస్తూ వారి గుండెల్లో ధైర్యాన్ని నింపారు.