మీడియా ప్ర‌తినిధుల‌కు 50 ల‌క్ష‌లు ఇవ్వాలి : ఏఐఎస్ఎఫ్‌

మీడియా ప్రతినిధులను కరుణ వారియర్స్ గా గుర్తించి వారికి 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కల్పించాలని ఏఐఎస్ఎఫ్‌ ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులను జాతీయం చేస్తూనే కరోనా చికిత్సలో విస్తృత పరుస్తూనే మీడియా ప్రతినిధులను కరోనా వారియర్స్ గా గుర్తించి 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు కాజీపేట గాంధీ సర్కిల్ లో ప్ల‌ కార్డ్స్ సహాయంతో నిరసన వ్యక్తం చేస్తున్న ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి గండు వెంకటేష్ ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మాలకొండయ్య ప్రతినిధులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నేపద్యంలో ఎమ్మార్పీ ధరలు మించి మందులు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటూనే కరోనా చికిత్సను అందజేయాలని ఐసోలేషన్ లో ఉంటున్న కరోనా బాధితులకు కరోనా కిట్లు అందజేయాలన్నారు పౌష్టికాహారాన్ని అందిస్తూనే హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారికి ప్రభుత్వ క్వారంటైన్ లో మాదిరిగా అన్ని రకాల మందులు అందజేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.