ఓయులో ఆ పత్రాలను దహనం చేసిన యువ నాయకులు
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన “నూతన విద్యా విధానం 2020” బిల్లును వ్యతిరేకిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీల ఆధ్యర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు బిల్లు యొక్క ప్రతులను దహనం చేశారు. ఉదయం ఓయు ప్రధాన భవనం ముందు నూతన విద్యా విదానాన్ని వ్యతిరేకిస్తూ… నినాదాలు చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యావిధానాన్ని పూర్తిగా కూలీ చేసేలా ఉందని మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయని విమర్శించారు. కేంద్రం తీసుకున్న చర్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జావేద్, పరుశారం, రియాజ్, రాము, గంగాధర్, ప్రతిభ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.