యుజిసి సర్క్యులర్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలి -కనుకుంట్ల సన్ని గౌడ్

-డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల ను కూడా ప్రమోట్ చేయాలి
అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఎఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నస్పూర్ లోని ఎమ్మార్ఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన సందర్బంగా మంచిర్యాల జిల్లా కార్యదర్శి సన్ని గౌడ్ మాట్లాడుతూ ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల కేంద్రాల్లోని ఎమ్మారోఓ కార్యాలయల ముందు నిరసన తెలియచేసాము. అనంతరం కార్యాలయ సూపరిడెంట్ గారికి డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని అంద‌జేశారు.
1) 2020 – 2021 విద్యాసంత్సరం ను ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభిస్తుంది అనే స్పష్టమైన విధానం ప్రకటించాలి, లేదా జీరో ఇయర్ ప్రకటించాలి. విద్యావ్యవస్థ స్థితిగతులపై మేధావులతో ఉపాధ్యాయ సంఘాలతో విద్యార్థి సంఘాలతో చర్చలు నిర్వహించాలి
2) ఆన్లైన్ విద్యాబోధన ఆలోచన నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల్లో జరుగుతున్నటువంటి ఆర్థిక దోపిడీని అరికట్టాలి
3) మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు అందించే పౌష్టికాహారాన్ని నేరుగా విద్యార్థుల ఇంటి వద్దకు వెళ్లి అందించాలి
4) సెక్యులర్ ప్రజాస్వామ్యం అనే పాఠ్యాంశాలను CBSE లో నుండి తొలగించడం జరిగింది దీన్ని ఏఐఎస్ఎఫ్ మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి తిరిగి మళ్లీ CBSE లో ఈ పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలి
5) కేంద్రం విడుదల చేసిన ugc గైడ్ లైన్స్ ని వెనక్కి తీసుకుని డిగ్రీ చదువుతున్న టువంటి ఫైనల్ ఇయర్ విద్యార్థులను కూడా కరోనా వ్యాప్తికి దృష్ట్యా ప్రమోట్ చేయాలి
పై డిమాండ్స్ మీద ప్రభుత్వం తగు ఆలోచనలు చేయకుంటే AISF గా ఉద్యమ కార్యాచరణ రూపొందించుకొని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియచేస్తున్నాము..
ఈ నిరసన కార్యక్రమంలో aisf మండల కార్యదర్శి వొజ్జల సాయి రామ్, మండల సహాయ కార్యదర్శి సందీప్, బొప్ప సాయి కృష్ణ, ఉపాధ్యక్షుడు అరవింద్ చారీ , మండల నాయకులు పాల్గొన్నారు.