ఆర్ఎస్ఎస్ ఎజెండా కోసమే నూతన విద్యా విధానం : ఏఐవైఎఫ్‌

విద్య కాషాయీకరణ వ్యాపారీకరణ అధికార వికేంద్రీకరణ లో భాగంగా భారతదేశ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసేందుకు మరియు ఆర్ ఎస్ ఎస్ అజెండా తీసుకు వచ్చేందుకు బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షులు బాలు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర కేబినెట్ ఏకపక్షంగా విద్యా విధానాన్ని ఆమోదించడాన్ని ఖండిస్తున్నామన్నారు లౌకికత్వం సోషలిజం భావనలకు సామాజిక న్యాయానికి స్థానం లేని విద్యా వ్యవస్థను దేశం మీదఅమలుచేస్తుందన్నారు దేశంలోని ప్రభుత్వ జాతీయ విద్యా సంస్థలను ప్రోత్సహించకుండా అంతర్జాతీయ విద్యా సంస్థలను ఆహ్వానించడం వ్యాపారం చేయడమే అవుతుంది అన్నారు అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా విద్యారంగానికి బడ్జెట్లో 6% కేటాయించడం సిగ్గుచేటు ప్రైవేట్ విద్యరంగాలను నియంత్రించకుండా ఫీజుల నిర్ణయంలో స్వేచ్ఛ ఇవ్వడం దోపిడీకి తెరవడమే అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఇ మాలకొండయ్య ఉపాధ్యక్షులు వరికుంట్ల సత్యం తదితరులు పాల్గొన్నారు.