భాజపా నేతలను అడ్డుకోవడం సరికాదు : సంతోష్‌రెడ్డి
సీఎం సొంత నియోజకవర్గంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించడానికి వెళ్తున్న భాజపా నేతలను పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు మెదక్ జిల్లా భాజపా నాయకులు సంతోష్‌రెడ్డి. రైతులను రాజులను చేస్తానని చెబుతున్న సీఎం తన సొంత నియోజవర్గంలో రైతు ఆత్మహత్య చేసుకోవడం పాలన అద్దం పడుతుందని పేర్కొన్నారు. పోలీసులు కూడా ప్రభుత్వ అనుకూలంగా పని చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైన సీఎం రైతు సమస్యలపై శ్రద్ద చూపాలని కోరారు.