రైతుల సేవకే సీఎం అంకితం : తిరుపతి యాదవ్
అన్నదాతల అభ్యున్నతికే రాష్ట్ర ప్రభుత్వం రైతువేదికలను నిర్మిస్తోందని తెరాస యువ నాయకులు తిరుపతి యాదవ్ అన్నారు. రైతును రాజు చేయడం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పండించిన పంటలు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవడం కోసం వారిని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. రైతుబంధు పథకంతో ఎకరాకు ఏడాదిలో రూ.10 వేలు ఇవ్వడంతోపాటు రైతుబీమాతో మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందిస్తున్నట్లు వివరించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు కేంద్రాలను పల్లెల్లో ఏర్పాటు చేశామన్నారు. రైతులు పండించిన పంటలు ప్రభుత్వమే కొనుగోలు చేసి వారం రోజుల్లో వారి ఖాతాల్లో డబ్బులు చేస్తున్నదని వివరించారు. విపక్షాలు ఇప్పటికైన రైతులకు చేస్తున్న సేవలను గుర్తించాలని కోరారు.