ఆర్బిట్రేజ్ ఫండ్‌తో స్వల్పకాలపు ఒడిదుడుకులపై సవారీ చేయండి
మార్కెట్ ఒడిదుడుకుల వేళ పెట్టుబడిదారుల నుంచి ఆర్బిట్రేజ్ విభాగపు నిధుల పట్ల అమితాసక్తిని గమనించడం జరిగింది. పెట్టుబడిదారులు కనీస రిస్క్, ఆవర్తన ఆదాయ, పన్ను ప్రయోజనాలతో మూలధన వృద్ధి లక్ష్యంగా చేసుకుని ఆర్బిట్రేజ్ ఫండ్‌ను ఉపయోగిస్తున్నారు. పూర్తిస్థాయి హెడ్జ్డ్ ఈక్విటీ పోర్ట్‌ఫోలియో మెరుగైన ఆర్బిట్రేజ్ అవకాశాల కోసం చూడటంతో పాటుగా ఏదైనా డైరెక్షనల్ ఈక్విటీ కాల్ యొక్క నష్టాలను సైతం దూరంగా ఉంచుతుంది.
తొలి తరం ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో ఒకటి యుటీఐ ఆర్బిట్రేజ్ ఫండ్. దీనిని 2006లో ఆవిష్కరించారు. ఈ ఫండ్ తమ రెగ్యులర్, డైరెక్ట్ ప్లాన్స్ కింద నెలవారీ డివిడెండ్‌లను చెల్లించడంతో పాటుగా చక్కటి పనితీరును సైతం ప్రదర్శిస్తుంది. మిశ్రమ వార్షిక వృద్ధి పద్ధతిలో ఈ ఫండ్ తమ రెగ్యులర్ ప్లాన్ గ్రోత్ ఆప్షన్ కింద 5.36% రాబడిని అందిస్తుంది అలాగే తమ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ అవకాశం కింద 5.90% రాబడిని అందిస్తుంది.
ఇతర డెబ్ట్ ఇన్వెస్ట్‌మెంట్ విభాగాలతో పోలిస్తే,ఈ ఫండ్ ఈక్విటీ ఓరియెంటెడ్ కావడం చేత నిర్థిష్టమైన పన్ను ఆర్బిట్రేజ్‌ను సైతం ఆస్వాదిస్తుంది. ఈ ఫండ్‌కు నెలవారీ డివిడెండ్ పంపిణీ పరంగా చక్కటి ట్రాక్ రికార్డు కూడా ఉంది. డివిడెండ్ రూపంలో పీరియాడిక్ ఆదాయం ఉండటం చేత ఇన్వెస్టర్లు తమ ఆర్థిక వ్యవస్థలను సమగ్రమైన పద్ధతిలో ప్రణాళిక చేసుకోవడం సాధ్యమవుతుంది.
ప్రస్తుత మార్కెట్‌లో క్రెడిట్ సమస్యలతో పాటుగా మార్కెట్ ఒడిదుడుకులు కారణంగా ఆర్బిట్రేజ్ నిధులు స్వల్పకాలంలో నిధుల కేటాయింపు కోసం సురక్షిత పెట్టుబడి మార్గాలుగా నిలుస్తాయి. ఈ ఫుల్ హెడ్జ్డ్ ఈక్విటీ పోర్ట్‌ఫోలియో మదుపరుల బాధలను తొలగించడంతో పాటుగా ఆర్బిట్రేజ్ అవకాశాల నుంచి అత్యధిక రాబడులను లక్ష్యంగా చేసుకుంది. డెబ్ట్ పరంగా, ఫండ్ మేనేజర్ ప్రధానంగా 215 రోజుల రమారమి మెచ్యూరిటీతో నాణ్యమైన డెబ్ట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌పై దృష్టి సారిస్తున్నారు.
ట్రాక్ రికార్డ్‌ను పరిగణలోకి తీసుకుంటే యుటీఐ ఆర్బిట్రేజ్ ఫండ్ చక్కటి పెట్టుబడి అవకాశంగా ఉంటుంది. ఈ ఫండ్ గణనీయంగా 2019లో 1319 కోట్ల రూపాయల ఏయుఎం నుంచి 2020, జూలై 07వ తేదీ నాటికి 2991 కోట్ల రూపాయలకు వృద్ధి చెందింది.