లివ‌ర్ స‌మ‌స్య‌ల‌తో ఏటా 13 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణిస్తున్నారు

లివ‌ర్ స‌మ‌స్య‌ల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా ల‌క్ష‌ల మంది మ‌ర‌ణిస్తున్నార‌ని హైద‌రాబాద్ సిటిజ‌న్ హాస్ప‌టల్ క‌న్స‌ల్టెంట్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్ట్, హెప‌టాల‌జిస్ట్ డాక్ట‌ర్ శార‌ద.పి అన్నారు. లివ‌ర్ స‌మ‌స్య‌లు ప్ర‌జ‌లు ప్ర‌త్యేక దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.
ఇప్పుడు ప్ర‌పంచ అంతా కూడా కోవిడ్‌-19లో ప్ర‌భావితం అవుతోంది. కానీ ఈ వ‌రల్డ్ హైప‌టైటిస్ డే సంద‌ర్భంగా లివర్ దెబ్బ‌తీసే వైర‌స్‌లకి స‌బంధించిన అవ‌గాహాన పెంచుకోవ‌డం ఎంతైన అవ‌స‌రం. వైర‌ల్ హైప‌టైటిస్ అనేది లివ‌ర్‌కి సంబంధించిన అతి ముఖ్య‌మైన జ‌బ్బు. దీని వ‌ల‌న లివ‌ర్ సిర్రోసిస్ కాకుండా లివ‌ర్ క్యాన్స‌ర్ కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంది.
ముఖ్యంగా మ‌న‌కి ఐదు ర‌కాల హైప‌టైటిస్ వైర‌స్‌లు ఉన్నాయ‌ని చెప్పుకోవ‌చ్చు. వాటినే హైప‌టైటిస్ ఏ,బి,సి,డి మ‌రియు ఈ అని పిలుస్తాయి. వీటిల్లో హైప‌టైటిస్ బి మ‌రియు సి వ‌ల‌న ఏడాదికి 13 లక్ష‌ల మంది ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌ర‌ణానికి గుర‌వుతున్నారు. దీనికి తోడు ఇప్పుడు కోవిడ్‌-19 మూలంగా ఈ మ‌ర‌ణాలు ఎక్కువ‌గా అయ్యాయని చెప్పుకోవచ్చు. మ‌నం కార‌ణాలు చూసిన‌ట్లు అయితే కొన్ని నేరుగా కోవిడ్ వ‌ల్ల అవ్వ‌గా… మ‌రిన్ని కోవిడ్ వ‌ల్ల ప్ర‌భావితం అయ్యాయ‌ని చెప్పొచ్చు. ధీర్ఘ‌కాలింగా లివ‌ర్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడుతున్న వారు ఈ ప‌రిస్థితుల్లో బ‌య‌ల‌కు వెల్ల‌లేక‌, స‌రైన చికిత్స స‌మ‌చానికి అంద‌కా.. మ‌ర‌ణానికి గుర‌వుతున్నారని చెప్పుకోవచ్చు. హైప‌టైటిస్ బి టీకాల వ‌ల్ల ఎంతో మందికి ఉప‌యోగ‌ప‌డేవి. కానీ ప్ర‌స్తుతం ఈ టీకాలు తీసుకోవ‌డానికి భ‌య‌ప‌డి చాలా మంది హైప‌టైటిస్ బి బారిన ప‌డుతున్నారు.
ఈ సంవ‌త్సం వ‌రల్డ్ హైప‌టైటిస్ డే యొక్క సందేశం హైప‌టైటిస్ లేని భ‌విష్య‌త్తు. ముఖ్యంగా గ‌ర్భ‌వ‌తులు మ‌రియు పిల్లలు ఈ జ‌బ్బు భారిన ప‌డ‌కుండా ఒక అవ‌గాహాన తీసుక‌రావ‌డం ప్ర‌ధాన ల‌క్ష్యం. హైప‌టైటిస్ బి మ‌రియు సి, తల్లి నుండి బిడ్డ‌కి, మ‌రియు ర‌క్త మార్పిడి వ‌ల్ల వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ వైర‌స్‌లు సెక్స్ ద్వారా కూడా వ్యాప్తి చెంద‌వచ్చు. హైప‌టైటిస్ సి కి టీకా లేన‌ప్ప‌టికీ కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ద్వారా హైప‌టైటిస్ బి ని చాలా వ‌ర‌కు నివారించ‌వ‌చ్చు. ఇవే కాకుండా ఏ మ‌రియు ఈ వైర‌స్‌లు క‌లుషిత ఆహారం, నీరు ద్వారా వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంటుంది. బి మ‌రియు ఏ టీకాలు చిన్న‌త‌నంలో తీసుకునే వ్యాక్సినేష‌న్ ప్ర‌ణాళిక‌లో చాలా మ‌ట్టుకు ఇవ్వ‌డం జ‌రుగుతుంది.