కరోనా మరణాలను దాస్తున్న ప్రభుత్వం : తెజస
ప్రభుత్వం కరోనా మరణాలను తగ్గించి చెప్తోందని మెదక్ జిల్లా తెజస యువజన విభాగం అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు హాస్పిటళ్లకు కూడా తప్పుడు లెక్కలు చెప్తున్నాయని అన్నారు. శ్మశాన వాటికల దగ్గర దహనం చేస్తున్న మృతదేహాల సంఖ్య ఎక్కవుగా ఉందని, ప్రభుత్వ లెక్కలు మాత్రం తక్కువగా ఉన్నాయని అన్నారు. కరోనా ప్రభావం గుండె, ఊపిరితిత్తుల పై పడి ఎక్కువమంది మరనిస్తున్నారని, కానీ ఆ మరణాలను కూడా సాధారణ మరణాలుగా చూపుతున్నారని ఆరోపించారు. సాధారణ మరణం అని చెప్పి కోవిడ్ నిబంధనల ప్రకరాం దహన సంస్కారాలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.











